సమంత మాయోసైటిస్ తో చాలా ఇబ్బంది పడింది. దాదాపుగా ఆరు నెలలు పాటు ఆమె రెస్ట్ తీసుకుంది.. తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ కూడా పక్కనపట్టేయాల్సి వచ్చింది. అయితే మాయోసైటీస్ నుండి కొద్దిగా కోలుకోగానే ఆమె మళ్ళీ తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ ని డే అండ్ నైట్ కష్టపడుతూ పూర్తి చేసింది. ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ పూర్తి చేసిన సమంత ఓ ఏడాది పాటు షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుంది.
ఆ విషయం సమంత క్లారిటీ ఇవ్వకపోయినా.. సమంత చేసే పనులతో అది కన్ ఫర్మ్ అయ్యింది. అయితే ఆమె ఈ ఏడాది బ్రేక్ తీసుకున్నది కూడా ఆమె ఆరోగ్యం కోసమే అని, మాయోసైటిస్ అనేది మందులతో తగ్గే వ్యాధి కాదు గనక ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూనే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుందట. అందుకే ఆమె ఒప్పుకున్న సినిమాలని కూడా ఆమె వదిలేసుకొని, తీసుకున్న అడ్వాన్స్ లు కూడా వెనక్కి ఇచ్చేసింది అనే ప్రచారం జరిగింది.
కానీ సమంత ఏ కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదట. ఖుషి, సిటాడెల్ కోసం కొద్దిగా ఓపిక చేసుకుని షూటింగ్స్ పూర్తి చేసిన సమంత కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనుకుంటుందట. అమెరికా ప్రయాణానికి ముందు ఆమె ఖుషి డబ్బింగ్ తో పాటుగా ప్రమోమోషనల్ ఈవెంట్స్ ఫినిష్ చేసేందుకు ఇక్కడే ఉండిపోయింది. ఆ గ్యాప్ లో ఆమె తన స్నేహితురాలితో కలిసి బాలి ట్రిప్ వెళ్లి వచ్చింది.
అలాగే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. ఆ పిక్స్ లో సమంత స్విమ్మింగ్ పూల్ దగ్గర కూచుని కూల్ గా కనబడుతుంది. పెద్ద బంగ్లా ఎదురుగా స్విమ్మింగ్ పూల్ పైన కూర్చుని సమంత నవ్వుతూ కనిపించింది. అయితే సమంత ఇప్పుడు పూర్తిగా నేచర్ ని ఎంజాయ్ చేస్తుంది. రిలాక్స్ మోడ్ లో కనిపిస్తుంది.