మెగాస్టార్ చిరంజీవి యంగ్ లుక్స్ లో కనిపించడానికి చాలా ట్రై చేస్తున్నారన్న విషయం ఆయన నటిస్తున్న ప్రతి సినిమాకి అర్ధమవుతూనే ఉంది. అయితే ఇప్పుడు అయన యంగ్ లుక్స్ మాట దేవుడెరుగు మెగాస్టార్ చిరు మొహం ఎందుకో బాగా బ్లాక్ గా కనిపించింది. భోళా శంకర్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరు చాలా నల్లగా కనిపించారు అనే మాట నెటిజెన్స్ నుండి వినిపిస్తుంది. ఆయన యంగ్ గా ఉన్నాను అని చెప్పడానికి రకరకాలుగా ట్రై చేస్తున్నారనేలా ఆయన బిహేవియర్ ఉంది.
తనకన్నా వయసులో చిన్నది, ఆల్మోస్ట్ తన కూతుళ్ళ వయసు ఉన్న కీర్తి సురేష్ దగ్గర ఆ వయ్యారాలు పోవడమేమిటి.. యంగ్ హీరోలా వేషాలు వేస్తున్నారు అంటూ మెగాస్టార్ ని పలువురు విమర్శిస్తున్నారు. కీర్తి సురేష్ తనకి చెల్లిగా నటించింది అది జస్ట్ సినిమాలోనే అని చెప్పడానికే ఆయన అంత తాపత్రయ పడ్డారా.. లేదంటే తనకి వయసు అవలేదు.. తనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పుకోవడానికే ఇలా చేసారా అనే కామెంట్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
భోళా శంకర్ ఈవెంట్ లోనే కాదు.. ప్రమోషనల్ ఇంటర్వూస్ లోను చిరంజీవి అంతే చేసారు.. అంటూ సోషల్ మీడియాలో శ్రీరెడ్డి లాంటి వారు విమర్శిస్తున్నారు. గద్దర్ చనిపోయారు.. కనీసం రెండు నిముషాలు ఆయనకి మౌనం పాటిస్తే మీ మీద రెస్పెక్ట్ పెరిగేది.. కానీ కీర్తి సురేష్ తో అలాంటి చేష్టలతో మీ మీద గౌరవం పోయింది అంటూ ట్వీట్స్ వేస్తున్నారు.