పుష్ప ద రూల్ షూటింగ్ ఎంతవరకు అయ్యింది, అసలు రిలీజ్ తేదీపై ఇంత సస్పెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు.. సుకుమార్-అల్లు అర్జున్ లు పుష్ప 2 పై హైప్ పెంచడానికే ఇలా డేట్ ఇవ్వకుండా అభిమానులకి పరీక్ష పెడుతున్నారా.. మైత్రి మూవీస్ మేకర్స్ పుష్ప లాంటి ప్యాన్ ఇండియా మూవీకి విడుదల తేదీ ఇవ్వకుండా ఇంత హంగామా చేస్తుంది ఏమిటో అంటూ సోషల్ మీడియాలో రకరకాల సెటేరికల్ ఆర్టికల్స్ దర్శనమివ్వడం ఒక ఎత్తు.. అల్లు ఫాన్స్ రిలీజ్ డేట్ కోసం చేసే యుద్ధం ఒక ఎత్తు.
అయినా పుష్ప మేకర్స్ నుండి ఎలాంటి స్పందన లేదు. తాజాగా పుష్ప ద రూల్ షూటింగ్ ఈ రోజు నుండి హైదరాబాద్ లోనే ఓ భారీ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతునట్టుగా అప్ డేట్ వచ్చేసింది. ప్రముఖ పీఆర్వో పుష్ప 2 అప్ డేట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అల్లు అర్జున్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణని సుకుమార్ చేపట్టబోతున్నారు అని తెలుస్తోంది.
నేడు ఆగష్టు 7న పుష్ప ద రూల్ విలన్ పాత్రధారి ఫహద్ ఫాసిల్ బర్త్ డే. మరి ఈ రోజు పుష్ప 2 నుండి అల్లు ఫాన్స్ ఏదైనా అప్ డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.. మేకర్స్ ఆ ట్రీట్ ఇస్తారో.. లేదంటే డిస్పాయింట్ చేస్తారో చూడాలి.