అఖిల్ ఏజెంట్ కి కష్టాలు వదల్లేదా.. ఇంతవరకు ఏజెంట్ మూవీ ఓటిటీలో స్ట్రీమింగ్ కి రాలేదు అంటే.. ఏమనుకోవాలి. అసలు సోని లివ్ ఏజెంట్ మూవీని వదులుతుందా.. వదలదా అని చాలామంది కామెడీగా మాట్లాడుకుంటున్నారు. అక్కినేని అభిమానూలు కూడా ఎదురు చూసి చూసి అలిసిపోయారు. థియేటర్స్ లో అట్టర్ ప్లాప్ అయ్యాక ఆ సినిమా ఓటిటీ హక్కులు దక్కించుకున్న సోని లివ్ దానిని రీ ఎడిటింగ్ చేయబోతుంది అంటూ ఏవేవో ఊహాగానాలు నడిచాయి.
తర్వాత ఏజెంట్ నిర్మాత ఏకే ఎంటర్టైన్మెంట్ అనిల్ సుంకర కూడా మేము ఓటిటీ కి అమ్మేసాం వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలియదు అనేసారు. ఏప్రిల్ 28 న విడుదలైన ఈ చిత్రం ఇన్నాళ్లయినా ఓటిటీ లో స్ట్రీమింగ్ అవ్వడానికి నోచుకోలేదు. ఇది అక్కినేని అభిమానులకి ఎంత అవమానం. అట్టర్ ప్లాప్ మూవీస్ కూడా మూడు వారాల్లోపే ఓటిటీ లోకి వచ్చేస్తుంటే అఖిల్ ఏజెంట్ కి మోక్షం ఎప్పుడో అంటూ వాపోతున్నారు.