నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, ఎంతైనా తిడుతుంది అని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అడుగడుగునా నిరూపిస్తూనే ఉన్నాడు. టీడీపీ నుండి వైసీపీ లోకి వెళ్లి టీడీపీ అధ్యక్షుడిని టిడిపి నేతలని అనరాని మాటలంటూ రౌడీలా చెలరేగిపోయే కొడాలి నాని ప్రస్తుతం మంత్రి పదవి ఊడి ఖాళీగా కూర్చున్నాడు. అవకాశం కల్పించుకుని మరీ టీడీపీ పై, పవన్ కళ్యాణ్ పై అవాకులు చావకులు పేలుతూనే ఉంటాడు.
తాజాగా పవన్ కళ్యాణ్-చంద్రబాబు పొత్తుపెట్టుకుని ఎక్కడ గెలిచేసి తమని ప్రతి పక్షంలో కూర్చోబెడతారో అనే కంగారులో కొడాలి నాని మరోసారి పవన్ పై చంద్రబాబు పై రెచ్చిపోయి మాట్లాడాడు. బూతు మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు.
కొడాలి బట్టలిప్పదీస్తుంటే పవన్ విప్పించుకుంటాడా.. ఏం మాట్లాడుతున్నావ్ కొడాలి.. ముందు నువ్వు గెలుస్తావో.. లేదో.. చూసుకో..ఈసారి నువ్వు ఇంటికే.. అయినా పదవి లేని వాడు మాట్లాడితే వాటికి విలువ ఉండదు.. ముందు నీ సంగతి చూసుకో.. నీ బట్టలు ఊడదియ్యకుండా చూసుకో.. పిచ్చిగా వాగితే నాలుక తెగుద్ది అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొడాలి కి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.