ఈ మధ్య ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్లు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారంటూ.. బ్రో సినిమా కలెక్షన్స్‌పై సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్న ఓ పొలిటికల్ లీడర్‌పై పంచ్ విసిరాడు కమెడియన్ హైపర్ ఆది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో హైపర్ ఆది మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ సంబంధించి కొందరి లెక్కలను సరిచేసే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా బ్రో సినిమాపై కామెంట్స్ చేస్తున్న అంబటి రాంబాబుని కూడా ఆది వదిలిపెట్టలేదు. ఈ విషయంపై ఆది మాట్లాడుతూ..
* భోళా శంకర్ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్య సినిమాలో ఎలా అయితే అన్ని ఎలిమెంట్స్‌తో పాటు బ్రదర్ సెంటిమెంట్ వర్కవుట్ అయిందో.. భోళా శంకర్ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌తో పాటు సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కవుట్ అవుతుంది. చిరంజీవిగారి వన్ మ్యాన్ షో చూడబోతున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవిగారు చూడని సక్సెస్‌లు, బ్లాక్‌బస్టర్స్ లేవ్. ఈ భోళా శంకర్ సినిమా మెహర్ రమేష్‌గారికి, నిర్మాత అనిల్ సుంకరగారికి మంచి విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నిర్మాతలకు రిస్క్ అవసరం లేదండీ.. ఎందుకంటే.. ఈ మధ్య ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్లు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నో ప్రాబ్లమ్.. వాళ్లు చూసుకుంటారు. ఎంత వచ్చిందీ.. ఏంటీ అనే లెక్కలన్నీ వాళ్లు చెప్పేస్తారు. ఎవరూ టెన్షన్ పడకండి. మన కలెక్షన్స్ చాలా తక్కువ వచ్చాయంట.. అవును ఆయన వెనకేసుకున్న కలెక్షన్స్‌తో పోల్చుకుంటే.. మన కలెక్షన్స్ తక్కువే. వాటిని మనం ఎప్పుడూ బీట్ చేయలేం.. అంటూ అంబటికి ఆది తన తరహాలో క్లాస్ ఇచ్చాడు.