ఇండస్ట్రీలోని ఓ డైరెక్టర్.. చిన్న పెగ్ వేసినప్పుడు చిరంజీవిగారిని, పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్‌స్టార్‌గారిని విమర్శిస్తుంటాడు అంటూ రామ్ గోపాల్ వర్మకు భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో హైపర్ ఆది ఇచ్చిపడేశాడు. ఆయన ఎన్ని వ్యూహాలు రచించినా.. అవి ఈసారి బెడిసి కొట్టడం పక్కా అంటూ.. హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్‌కి స్టేడియో హోరెత్తిపోయింది. ఇంకా హైపర్ ఆది మాట్లాడుతూ..
* ఈ టాలీవుడ్‌లోనే ఓ డైరెక్టర్ ఉన్నారు. ఆయనని అనే స్థాయి నాకు లేదు. అలాగే ఆయనకి కూడా మెగాస్టార్‌ని, పవర్‌స్టార్‌ని విమర్శించే స్థాయి ఆయనకు కూడా లేదు. ఆయన చిన్న పెగ్ వేసినప్పుడు చిరంజీవిగారిని, పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్‌స్టార్‌గారిని విమర్శిస్తుంటాడాయన. అలాంటివాళ్లకి చెబుతున్నా.. అర్థం లేని విమర్శలకు క్లాప్స్ రావు.. అర్థం కాని సినిమాలకు కలెక్షన్సూ రావు. నాకు తెలిసి మీ ‘వ్యూహాలు’ బెడిసి కొడతాయని నా నమ్మకం. అదే విధంగా ఏ ప్రభుత్వాలైతే.. ఆయన సేవని గుర్తించి అవార్డులు ఇచ్చాయో.. అదే ప్రభుత్వాలు ఆయన రాజకీయాలలోకి వచ్చినప్పుడు.. ఆ బ్లడ్ బ్యాంక్ గురించి తప్పుడు ప్రచారాలు చేశాయ్. అప్పుడు కూడా భరించాడు.. క్షమించాడు.. దటీజ్ మెగాస్టార్.
* కొంతమంది ఉంటారు.. అన్నయ్యని పొగిడేసి.. తమ్ముడిని తిట్టేస్తుంటారు. వీళ్లేవరంటే.. తెలివైన శాడిస్ట్‌లన్నమాట. ఏమయ్యా.. మీరు తమ్ముడిని తిట్టి.. అన్నయ్యను పొగిడితే.. ఆయన సంతోషపడే వ్యక్తా ఆయన. ఒక రోజు భోళా శంకర్ సెట్‌లో చిరంజీవిగారిని అడిగా. ఏదో పొలిటికల్ మ్యాటర్ వచ్చి మాట్లాడుతుంటే.. నేనీ మధ్య పొలిటికల్ న్యూస్ చూడట్లేదు ఆది అని అన్నారాయన. ఎందుకన్నయ్యా అని అడిగితే.. నా తమ్ముడిని ఎవరుపడితే వాళ్లు తిడుతుంటే.. అవి చూసి సహించలేకపోతున్నాను అని చెప్పారు. అది తమ్ముడి మీద అన్నయ్యకు ఉన్న ప్రేమ. అలాగే అన్నయ్య అంటే తమ్ముడికి కూడా చాలా ప్రేముంది. ఎంత ప్రేమంటే.. మెగాస్టార్‌గారిని అవమానించిన వారిని మెగాస్టార్ వదిలేస్తారేమోగానీ, తమ్ముడు గుర్తు పెట్టుకుని మరీ వడ్డీతో సహా ఇస్తాడు.. గుర్తు పెట్టుకోండి ఇది.