మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు విరామం ప్రకటించి సినిమాల్లోకి రీ ఏంటి ఇచ్చినప్పటినుండి ఆయన ఎక్కువగా రీమేక్స్ మీదే ఆధారపడి సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, ఇప్పడు వస్తున్న భోళా శంకర్, రాబోయే బ్రో డాడీ రీమేక్ లు. అయితే ఆయన వరసగా రీమేక్స్ చెయ్యడం మెగా ఫాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. భోళా శంకర్ విషయంలోనూ, గాడ్ ఫాదర్ విషయంలోనూ.. ఓటిటీ లో వచ్చేసిన సినిమాల్ని చిరు రీమేక్ చేయడంపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేసారు.
ఇప్పుడు బ్రో డాడీ కూడా వద్దు అనేది వారి బాధ. అయితే మెగాస్టార్ మాత్రం రీమేక్స్ చేస్తే తప్పేమిటి. మంచి కంటెంట్ ని తెలుగు ప్రేక్షకులకి అందించడానికి తెలుగు నటులు, దర్శకులు చేసే ప్రయత్నాన్ని మనమెందుకు కాదనాలి. అది తప్పేందుకు అవుతుందో నాకు అర్ధం కావడం లేదు.
ఇప్పుడు ఈ వేదాలమే తీసుకోండి.. ఇది తమిళంలో హిట్ అయిన సినిమా. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఏ ఓటిటీ లో ఈ సినిమా లేదు. ఎవరూ ఈ చిత్రాన్ని చూసి ఉండరు కూడా. మంచి కంటెంట్ ఉంది కాబట్టే నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అదే ధైర్యంతో చేశాను అంటూ మెగాస్టార్ తాను చేస్తున్న రీమేక్స్ వెనుక ఉన్న కారణాలని రివీల్ చేసారు.