Advertisement
TDP Ads

ప్రజా యుద్ధ నౌక‌కి లాల్ సలాం..

Wed 09th Aug 2023 08:35 AM
gaddar,chiranjeevi,jr ntr,gaddar no more  ప్రజా యుద్ధ నౌక‌కి లాల్ సలాం..
Chiranjeevi and Jr NTR pays tributes to Gaddar ప్రజా యుద్ధ నౌక‌కి లాల్ సలాం..
Advertisement

‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్నకి లాల్ సలాం.. గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసిందని అన్నారు చిరంజీవి. సోషల్ మీడియా వేదికగా ప్రజా గాయకుడు గద్దర్‌కు చిరంజీవి నివాళులు అర్పించారు. ప్రముఖ విప్లవ కవి, ప్రజాగాయకుడు గద్దర్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 

ఈ విషయాన్ని గద్దర్ కుమారుడిలో పాటు, అపోలో హాస్పిటల్ వైద్యులు అధికారికంగా తెలియజేశారు. గద్దర్ మృతికి కారణాలు తెలుపుతూ అపోలో హాస్పిటల్ యాజమాన్యం అఫీషియల్‌గా ఓ లెటర్‌ని కూడా విడుదల చేసింది. గద్దర్ మృతితో ఒక్కసారిగా ఆయన కుటుంబంలో, అభిమానుల్లో, సినిమా ఇండస్ట్రీలో సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి. తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసిందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

‘‘వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్న కి లాల్ సలాం! సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం!’’ అని చిరంజీవి ట్విట్టర్ వేదికగా గద్దర్‌కు నివాళులు అర్పించారు.

 

తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను- నందమూరి బాలకృష్ణ

‘‘ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్తిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’- జూనియర్ ఎన్టీఆర్

Chiranjeevi and Jr NTR pays tributes to Gaddar:

Popular Singer Gaddar No More

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement