ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా నటించిన ‘హిడింబ’ చిత్రం రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హింస ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు అంతగా ఈ సినిమాపై ఇంట్రస్ట్ పెట్టలేదు. సినిమా కాన్సెఫ్ట్, చిత్రీకరణ, హీరో అశ్విన్‌బాబు అలాగే హీరోయిన్ నందితా శ్వేత నటన.. ఇలా అన్నీ మంచి మార్కులు వేయించుకున్నప్పటికీ.. అనుకున్నంతగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. అయితే.. టాక్ పరంగా మాత్రం చిత్రయూనిట్ హ్యాపీగానే ఉంది.
ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ తరహా చిత్రాలన్నింటిలో కెల్లా.. ఈ సినిమా కాస్త బెటర్‌గానే ఉందనేలా టాక్ అయితే ఈ సినిమాకి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డిటైల్స్‌ని వెల్లడించారు. ఈ సినిమా ఆగస్ట్ 10వ తేదీ రాత్రి 7గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో థియేటర్లకి ప్రేక్షకులను రప్పించలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతుందని యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ మహానగరంలో వరసగా అమ్మాయిలు అదృశ్యమవడం కలకలం సృష్టిస్తుంది. అమ్మాయిల కిడ్నాప్ విషయంలో స్వయంగా సీఎం (శుభలేఖ సుధాకర్) కిడ్నాపర్‌ని పట్టుకున్నామని ప్రెస్ మీట్ పెడతారు. వరసగా 16 మంది అమ్మాయిల కిడ్నాప్ పోలీస్‌లకి సవాల్‌గా మారుతుంది. ఈ కేసుని సాల్వ్ చెయ్యడానికి కేరళ ఐపీఎస్ అధికారి ఆద్యని(నందిత శ్వేతా) పిలిపిస్తారు. ఆద్యతో కలిసి అభయ్(అశ్విన్ బాబు) కి ఈ అమ్మాయిల కిడ్నాప్ కేసుని సాల్వ్ చెయ్యమని పై అధికారులు బాధ్యతలు అప్పగిస్తారు. ఆద్య-అభయ్ లు ఈ కేసుని ఎలా సాల్వ్ చేసారు. ఈ కథలో కీలకమైన కాలాబండా కథ ఏమిటి.. కేరళ అమ్మాయిల మిస్సింగ్ కేసుకి, హైదరాబాద్‌లో మొదలైన అమ్మాయిల మిస్సింగ్ కేసుకి లింక్ ఏంటి? నరమాంస భక్షక గిరిజన జాతి హిడింబాలకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి అనేదే ఈ చిత్ర కథ.