Advertisementt

రష్మిక లక్కే లక్కు

Sun 06th Aug 2023 11:10 AM
rashmika mandanna  రష్మిక లక్కే లక్కు
Rashmika To Romance Vikram రష్మిక లక్కే లక్కు
Advertisement
Ads by CJ

హీరోయిన్ రష్మిక మందన్నకి అదృష్టం పట్టింది. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాక కొద్దిగా బ్రేక్ కూడా లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ అటుఇటు తెగ తిరిగేస్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం హిందీలో క్రేజీగా మారింది. బాలీవుడ్ హీరోయిన్స్ కన్నా ఎక్కువగా స్కిన్ షో చేస్తూ గ్లామర్ గా కనువిందు చేస్తుంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో యానిమల్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ చేసిన రష్మిక ప్రస్తుతం టైగర్ ష్రఫ్ తో కలిసి హడావిడి చేస్తుంది. అంతేకాకుండా షారుఖ్ తో యాడ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. 

అయితే రష్మిక తెలుగులో, కన్నడలో, హిందీలో పాపులర్ అయినంతగా తమిళ్ లో అవడం లేదు. ఆమెకి కార్తీ, విజయ్ లాంటి స్టార్స్ హోల్సేల్ షాకిచ్చారు. సుల్తాన్, వారసుడు ఆమెని బాగా నిరాశపరిచాయి. అయితే ఈ మద్యలో రశ్మికకి శేఖర్ కమ్ముల-ధనుష్ ప్యాన్ ఇండియా మూవీలో ఛాన్స్ వచ్చినట్లుగా ప్రచారం జరిగినా దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు కోలీవుడ్ లోనే రశ్మికకి భారీ బడ్జెట్ మూవీలో స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చింది అనే న్యూస్ హైలెట్ అయ్యింది. 

మలయాళంలో 2018 రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2018 డైరక్టర్, విక్రమ్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే కథానాయికగా రష్మికను అనుకుంటున్నారు అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషించబోతున్నట్లుగా సమాచారం. మరి ఇంత భారీ బడ్జెట్ మూవీలో ఆఫర్ వస్తే రశ్మికకి లక్కు కాక మరేముంటుంది. 

Rashmika To Romance Vikram:

Chiyaan Vikram to romance Rashmika Mandanna

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ