గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెన్సీ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేసాయి. అసలు చిన్న హింట్ కూడా ఇవ్వకుండానే తాను ప్రెగ్నెంట్ అంటూ ఇలియానా అందరికి షాకిచ్చింది. గత ఆరు నెలలుగా తాను ఎవరితో రిలేషన్ లో ఉన్నానో చెప్పకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఈ మధ్యనే బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేసిన ఇలియానా బేబీ బంప్ తో తీయించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిలో ఆశక్తిని క్రియేట్ చేసింది.
రీసెంట్ గా తొమ్మిది నెలల గర్భంతో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఇలియానా ఈనెల 1 నే డెలివరీ అయ్యింది. అంటే ఆగస్టు 1 మంగళవారం ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చిన విషయాన్ని ఈ రోజు ఆగష్టు 5 న ఇన్స్టా వేదికగా బయటపెట్టడమే కాదు.. ఆ బాబు పేరుని కూడా ప్రకటించేసింది. అంతేకాదు తన బాబు మొదటి ఫోటోని కూడా షేర్ చేసింది.
తన బాబుకి కోవా ఫీనిక్స్ డోలన్ అంటూ పేరు పెట్టినట్లుగా ఇలియానా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది. మరి మీరూ గోవా బ్యూటీ ఇలియానా బేబీ బాయ్ ఫోటోని ఓ లుక్కెయ్యండి.