అల్లు అర్జున్-సుకుమార్ లు ఏం చేస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ పూష ద రూల్ అప్ డేట్ ఇవ్వకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చున్నారు. అసలు పుష్ప రిలీజ్ డేట్ ఎప్పుడిస్తారంటూ అల్లు ఫాన్స్ ఎప్పటినుండో గోల చేస్తున్నారు. మిగతా హీరోలంతా రిలీజ్ డేట్స్ లాక్ చేసి సెట్స్ మీద పరుగులు తీస్తున్నారు. పుష్ప ద రూల్ షూటింగ్ అప్ డేట్ కూడా ఇవ్వకుండా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు..
పుష్ప మేకర్స్ ని నిద్రలేవమంటూ అల్లు అర్జున్ ఫాన్స్ అప్పుడప్పుడు ట్విట్టర్ హ్యాండిల్ లో WakeUpTeamPushpa అనే హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేసినట్టుగానే మరోసారి WakeUpTeamPushpa హాష్ టాగ్ తో తో రెచ్చిపోతున్నారు. Rey Nidra Levu Ra @PushpaMovie, @MythriOfficial, Emi Papam Chasthey Dorikinavara Maku Nu @MythriOfficial,Speed penchandi!!! Chala thaggindhi do fast guys🤙🤙 #WakeUpTeamPushpa, We want #PushpaTheRule update అంటూ ఫాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు.
నిన్నటినుండి పుష్ప ద రూల్ ని 2024 ఏప్రిల్ లో విడుదల చేసే ఆలోచనలో సుక్కు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఏప్రిల్ మూడో వారంలో పుష్ప ని రిలీజ్ చేస్తే 2024 సమ్మర్ కి వర్కౌట్ అవుతుంది అని అందుకే ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ తేదీ ని రెడీ చేస్తున్నారంటూ వార్తలొచ్చినా పుష్ప ప్రొడక్షన్ హౌస్ నుండి ఎలాంటి హడావిడి లేకపోయేసరికి తిక్కరేగి అల్లు ఫాన్స్ రచ్చ మొదలు పెట్టారు.