బ్రో చిత్రంలో సింపుల్ గా ఓ శ్యాంబాబు కేరెక్టర్ పెట్టి డాన్స్ చేయించినందుకే అదేదో తననే ఇమిటేట్ చేసి అవమానించారంటూ అంబటి రాంబాబు మీడియా ముందు పవన్ కళ్యాణ్ పై త్రివిక్రమ్ పై చిందులు వేస్తున్నాడు. అయితే బ్రో లో శాంపిల్ మాత్రమే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఫుల్ డోస్ ఉంటుంది..వైసీపీ వాళ్ళకి ఇత్తడే.. హరీష్ శంకర్ పంచ్ డైలాగ్స్ రాయడంలో దిట్ట.. ఉస్తాద్ భగత్ సింగ్ లో పొలిటికల్ పంచెస్ గ్యారెంటీ అంటూ ఓ వెబ్ సైట్ లో వచ్చిన వార్తలని హరీష్ శంకర్ సోషల్ మీడియాలో రీ ట్వీట్ చేసారు.
దానితో హరీష్శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చేత పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ చెప్పించడం ఖాయమని క్లారిటీ వచ్చేసింది. మరి బ్రో లో చిన్న బిట్ కే గుక్కపెట్టేసిన వైసీపీ వాళ్ళు ఉస్తాద్ లో రాబోయే పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఇకెంతగా మంటెత్తిపోతారో అంటూ పవన్ ఫాన్స్ పరాచికాలాడుతున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ కళ్యాణ్ మళ్ళీ డేట్స్ ఇచ్చారు.
ఈచిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతికి విడుదల చెయ్యాలని హరీష్ శంకర్ టార్గెట్ పెట్టుకున్నాడు. పవన్ కాస్త కోపరేట్ చేస్తే ఉస్తాద్ సంక్రాంతి బరిలోకి వచ్చేస్తుంది.