పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో విడుదల తర్వాత మంగళగిరికి వెళ్ళిపోయి అక్కడ జనసేన పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. మంగళగిరికి వెళ్ళి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డేట్స్ ఇప్పించుకున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాద్ కి వచ్చేశారని తెలుస్తుంది. ఈరోజు నైట్ పవన్ కళ్యాణ్ ఓ లావిష్ పార్టీని ఆరెంజ్ చేసారని తెలుస్తుంది. వరసగా మూడు రీమేక్స్ సక్సెస్ అవడంతో పవన్ కళ్యాణ్ ఈ పార్టీ ఆరెంజ్ చేశారట.
ఈ పార్టీ కోసం వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మరియు BRO చిత్రాల యూనిట్స్ ని ఆహ్వానించారు అని సమాచారం. ఆయన రాబోయే సినిమాల దర్శకులు, నిర్మాతలకు కూడా పార్టీ ఆహ్వానం అందింది అని.. BRO నిర్మాతలైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ పార్టీని హోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే ఈ పార్టీకి త్రివిక్రమ్ శ్రీనివాస్, మరికొంతమంది సినీ ప్రముఖులు స్పెషల్ గా హాజరవుతారని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే ఈ పార్టీపై అధికారిక సమాచారమైతే లేదు.