నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అంటూ నందమూరి అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. గత నాలుగేళ్ళుగా మోక్షుజ్ఞ సినీ ఎంట్రీపై ఎన్నో రకాల ఊహాగానాలు, మరెన్నో రకాల న్యూస్ యూ చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞని ఈ దర్శకుడు పరిచయం చేస్తాడు.. ఆ దర్శకుడి ఇంట్రడ్యూస్ చేస్తాడంటూ వార్తలు రావడమే కానీ ఫైనల్ గా మోక్షజ్ఞ ఎంట్రీ ఇంతవరకు జరగలేదు. ఈ ఏడాది జూన్ 10న బాలయ్య బర్త్ డే కి మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ అనౌన్సమెంట్ వస్తుంది అని అభిమానులు ఆశపడ్డారు.
కానీ అభిమానులని బాలయ్య మళ్ళీ మళ్ళీ డిస్పాయింట్ చేస్తూనే ఉన్నారు. ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 మూవీని బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రానికి ఎంపిక చేసారని.. కథ పై బాలయ్య ఎప్పటినుండో కూర్చున్నారని, ఆయనే డైరెక్షన్ చేసే ఛాన్స్ వుంది ఇలా ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినిమా అనౌన్సమెంట్ కి బాలకృష్ణ ముహూర్తం ఖరారు చేశారట.
ఈ దసరా సందర్భంగా బాలకృష్ణ తన కొడుకు ఎంట్రీ ఇవ్వబోయే సినిమాని అనౌన్స్ చేయబోతున్నారట. అక్టోబర్ 19 న బాలయ్య-అనిల్ రావిపూడి ల భగవంత్ కేసరి రిలీజ్ ఉంది. మరి అదే దసరా ఫెస్టివల్ కి మోక్షజ్ఞ మూవీ పై అనౌన్సమేట్ వస్తే నందమూరి అభిమానులకి పండగే.. పండగ.