యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దేవర షూట్ మొదలు పెట్టకముందే దేవర రిలీజ్ డేట్ లాక్ చేసేసారు. 2024 ఏప్రిల్ 5 న దేవర రాక అంటూ కన్ ఫామ్ చేసారు. అందుకు అనుగుణంగా దేవర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గనక ముందుగానే విడుదల తేదీని ప్రకటించారు. కానీ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా ఫిలిం పుష్ప ద రూల్ రిలీజ్ తేదీ ఇవ్వకుండా ఇంకా ఇంకా మేకర్స్ నాన్చుతూనే ఉన్నారు. షూటింగ్ విషయంలోనూ మైత్రి మూవీ మేకర్స్ అప్ డేట్స్ ఇవ్వడం లేదు.
అదాల ఉంటే పుష్ప టీజర్ దసరాకి ఇవ్వబోతున్నారు.. దసరా స్పెషల్ గా అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్ తో కట్ చేసిన టీజర్ వదిలేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరొపక్క పుష్ప రాజ్ ని మార్చి లో కానీ.. లేదంటే ఎన్టీఆర్ దేవర విడుదలైన రెండు వారాల తర్వాత కానీ విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని.. మార్చ్-ఏప్రిల్ డేట్స్ పై మైత్రి వారు కన్నేసి ఉంచారట.
దేవర వచ్చాక రెండు వారాల తర్వాతే పుష్ప 2 ని విడుదల చేస్తే పర్ఫెక్ట్ సమ్మర్ రిలీజ్ అవుతుంది.. ఆ వేసవి సెలవలు కూడా పుష్ప2 కి కలిసొస్తాయని భావిస్తున్నారట. పుష్ప 2 ఏప్రిల్ మూడో వారంలోనే దిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.