సమంత ప్రస్తుతం షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవుతుంది. సినిమా షూటింగ్స్ ముగించేసి వెకేషన్స్ అంటూ బాలిలో తేలింది. అక్కడ ఫ్రెండ్ తో ఓ వారం పాటు ఎంజాయ్ చేసిన సమంత సోషల్ మీడియానిమాత్రం వదిలిపెట్టలేదు. షూటింగ్స్ కి మాత్రమే బ్రేక్.. సోషల్ మీడియాకి కాదు అన్నట్టుగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సమంత పోస్ట్ చేస్తూనే ఉంది. అయితే సమంత షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుని అమెరికా వెళుతుంది. తనకి వచ్చిన మాయోసైటిస్ వ్యాధిని నయం చేసుకోవడానికే ఆమె అమెరికా ప్రయాణం అన్నారు.
ఇంతలోపులో సమంత తన అనారోగ్య సమస్యల ట్రీట్మెంట్ కోసం 25 కోట్లు ఖర్చుపెడుతుంది. దాని కోసమే సమంత ఓ నటుడిని ఆర్ధిక సహాయం అడిగింది అంటూ ప్రచారం మొదలైంది. ఆ ప్రచారానికి సమంత ఫుల్ స్టాప్ పెడుతూ తాను మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లు ఖర్చుపెట్టినట్లుగా.. ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను నా వ్యాధి చికిత్స కోసం చాలా తక్కువ మొత్తంలో ఖర్చు చేశాను.
నా కెరీర్ లో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. నేను నా ఆరోగ్యం, నా జాగ్రత్తలు చూసుకోగలను. ధన్యవాదాలు. మయోసైటిస్ అనేది ఓ సమస్య. ఈ వ్యాధితో వేలాది మంది బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చెయ్యండి.. కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు అవసరం లేదు అంటూ కాస్త గట్టిగానే సమంత 25 కోట్ల విషయంలో రియాక్ట్ అయ్యింది.