కాజల్ అగర్వాల్ పెళ్లయినా.. తల్లయినా తగ్గేదేలే అంటూ అందాలు ఆరబోస్తుంది. గ్లామర్ విషయంలో ఎప్పుడూ పొదుపు పాటించని కాజల్.. పెళ్లి తర్వాత పద్దతిగా మారుతుంది అనుకుంటే.. మరికాస్త గ్లామర్ డోస్ పెంచింది కానీ.. తగ్గించలేదు. అలాగే నటనను పక్కనపెట్టలేదు. పెళ్లితో కొద్దిగా బ్రేక్ తీసుకుని ఆచార్య సెట్స్ లో వాలిపోయిన కాజల్.. ఆ తర్వాత బాబు పుట్టాక కూడా అంతే స్పీడుగా షూటింగ్స్ లోకి వెళ్ళిపోయింది.
ఇండియన్ 2, భగవంత్ కేసరి షూటింగ్స్ తో పాటుగా మధ్యలో విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తుంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటో షూట్స్ వదులుతుంది. తాజాగా మెరూన్ కలర్ శారీ లో కాజల్ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ లో కాజల్ అందాలు చూపిస్తూ రెచ్చగొట్టే లుక్స్ లో అందరిని కవ్విస్తుంది. పెళ్లయినా, తల్లయినా ఎక్కడా తగ్గను అని మరోసారి కాజల్ ఈ శారీ పిక్స్ తో ప్రూవ్ చేసింది అనేలా ఆ ఫొటో షూట్ ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో లూజ్ హెయిర్ తో కాజల్ కవ్వించే చూపులకి పడిపోవాల్సిందే.