దర్శకుడు శంకర్ అంటేనే రిచ్ నెస్ కి కేరాఫ్ అడ్రెస్స్. సినిమాల్లో కంటెంట్ ఎంత బలంగా ఉంటుందో.. దానికి బడ్జెట్ ఆ లేవల్లోనే ఉంటుంది. ముఖ్యంగా సాంగ్స్ చిత్రీకరణలో శంకర్ తన మార్క్ ప్రతి సినిమాలో చూపిస్తారు. భారీ ఖర్చుతో స్పెషల్ సెట్స్ లో హీరో, హీరోయిన్స్ ని గ్రూప్ డాన్సర్స్, వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నిటిలో శంకర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా రామ్ చరణ్-కియారా అద్వానీలతో శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ సాంగ్స్ విషయంలోనూ ఈ రకమయిన ప్రచారం జరిగింది. ఒక్కో సాంగ్ కోసం శంకర్ 12 కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ గుసగుసలు వినిపించాయి.
తాజాగా దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ సినిమాలోని పాటల కోసమే దాదాపుగా 90 కోట్లు ఖర్చు చేశారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఇందులో అన్ని పాటలకు ఒక్క కొరియోగ్రాఫర్ మాత్రమే వర్క్ చేయలేదట. ప్రభుదేవా, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, గణేష్ మాస్టర్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో పాట చేసినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ సాంగ్ పై కొరియోగ్రాఫర్ జానీ మట్లాడుతూ థమన్ అయితే సాంగ్స్ అదరగొట్టేశాడు. మేము ఆల్రెడీ షూట్ చేసేశాం కాబట్టి చెబుతున్నాను. సాంగ్స్ అదిరిపోయాయి. చించేశారు. దానికి మించి ఇంకేమి చెప్పలేను. చరణ్ సార్ మీద నాకు ఎంత లవ్ ఉందో ఆ ప్రేమ అంతా కొరియోగ్రఫీలో చూపించాను.
జానీ మాస్టర్ ఇంకా మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ పాటలను చాలా కొత్తగా ట్రై చేశాం. అది ఇప్పటివరకూ నాకు తెలిసీ ఎవరూ ట్రై చేయలేదు. చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. శంకర్ సార్ నాకు మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. దానికి వర్క్ చేయడానికి నాకు అవకాశం కూడా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. 100 శాతం ఇందులో పాటలు అందరికీ నచ్చుతాయి అంటూ జానీ అందరిలో సాంగ్స్ పై హైప్ క్రియేట్ చేసాడు.