వినయ విధేయ రామ తర్వాత మరోసారి గేమ్ ఛేంజర్ తో జోడి కడుతున్న కియారా అద్వానీ-రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నారే కానీ.. ఇప్పటివరకు వారికి సంబందించిన లుక్ బయటికి రాలేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చెంజర్ మూవీ షూటింగ్ అలా అలా జరుగుతూనే ఉంది. రీసెంట్ గా కియారా అద్వానీ బర్త్ డే కి గేమ్ ఛేంజర్ నుండి ఆమె ఫస్ట్ లుక్ ఎమన్నా వస్తుంది అని అభిమానులు ఆశపడినా.. మేకర్స్ మాత్రం డిస్పాయింట్ చేసారు.
తాజాగా కియారా అద్వానీ గేమ్ చెంజర్ పై చేసిన కామెంట్స్ వైరల్ మారాయి. గేమ్ ఛేంజర్ రెండేళ్లుగా చిత్రీకరణ జరుగుతుందని, 2023 నాటికి చివరికల్లా గేమ్ ఛేంజర్ చిత్రీకరణను పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పిన కియారా అద్వానీ రామ్‌చరణ్ తనకి ప్రియ మిత్రుడని, డైరెక్టర్ శంకర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ చెప్పుకొచ్చింది.
గేమ్ ఛేంజర్ చాలా చక్కగా రూపుదిద్దుకుంది అంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. అంతేకాకుండా అందరూ ఊహించిన దానికంటే సినిమా చాలా బాగుంటుంది అని.. సినిమా కోసం ఎంతో కష్టపడినట్లుగా చెప్పుకొచ్చింది.