Advertisementt

ఆ డాన్స్ ఎన్టీఆర్-అల్లు అర్జున్ పక్కన చేస్తే..

Sun 06th Aug 2023 07:09 PM
sreeleela,skanda,extra ordinary man,allu arjun,ntr,nithiin,ram  ఆ డాన్స్ ఎన్టీఆర్-అల్లు అర్జున్ పక్కన చేస్తే..
Sreeleela Dance Creates Sensation in Social Media ఆ డాన్స్ ఎన్టీఆర్-అల్లు అర్జున్ పక్కన చేస్తే..
Advertisement
Ads by CJ

శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఏ హీరో పక్కన చూసినా శ్రీలీలే కనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్‌తో శ్రీలీల హవా సోషల్ మీడియాలోనూ పెరిగిపోయింది. యువ హీరోలైన నితిన్, రామ్‌తో కలిసి నటిస్తున్న సినిమాల నుండి శ్రీలీల మాస్ స్టెప్స్ బయటికి వచ్చాయి. అందులో రామ్ స్కంద నుండి వదిలిన సాంగ్‌లో శ్రీలీల గ్లామర్ షో పక్కనపెడితే ఆమె వేసిన మాస్ స్టెప్స్ ఆ పాటకే ఊపుని తీసుకొచ్చాయి. అందరి చూపు శ్రీలీల మీదే. రామ్ ఎంతగా డాన్స్ ఇరగదీసి స్టైలిష్‌గా ఉన్నా.. అందరూ శ్రీలీల గురించే మట్లాడారు.  

శ్రీలీల ఆ డాన్స్ గనక ఎన్టీఆర్-అల్లు అర్జున్ పక్కన వేసుంటే.. అది విపరీతంగా వైరల్ అయ్యేది. రామ్ పక్కన కాబట్టి జస్ట్ మాట్లాడుకుని వదిలేశారు. అదే ఏ జూనియర్ ఎన్టీఆర్ లేదంటే చరణ్, అల్లు అర్జున్ ఇలా ఎవ్వరి పక్కన చేసినా శ్రీలీలకి మరింతగా పేరొచ్చేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రామ్ కూడా ఆషా మాషి డాన్సర్ కాదు. రామ్ డాన్స్‌లో స్టయిల్ ఉంటుంది. అది ఇస్మార్ట్ శంకర్‌లోనే రివీల్ అయ్యింది. కాకపోతే అతనికి ఇప్పటివరకు ఇలాంటి మాస్ డాన్స్ ఎక్కువగా చేసే ఛాన్స్ రాక.. అతని డాన్స్ హైలెట్ కాలేదు అంతే కానీ లేదంటే రామ్ కూడా మంచి డాన్సర్. 

ఏదైనా శ్రీలీలకి ఈ స్టార్ హీరోస్‌లో ఎవ్వరైనా ఒక్క ఛాన్స్ ఇస్తే పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పటికే శ్రీలీల ఆల్మోస్ట్ టాలీవుడ్‌లో ముప్పావుశాతం హీరోలని కవర్ చేస్తూ హడావిడి చేస్తుంది. ఇక స్టార్ హీరోస్ అవకాశాలు తగిలితే ఆమెని ఆపడం కష్టమే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలలో ఇప్పటికే ఆమె నటిస్తోంది.

Sreeleela Dance Creates Sensation in Social Media:

Sreeleela Starring Movies Songs Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ