Advertisementt

పెళ్ళయిపోయిందంటూ షాకిచ్చిన రష్మిక

Thu 03rd Aug 2023 07:10 PM
rashmika mandanna  పెళ్ళయిపోయిందంటూ షాకిచ్చిన రష్మిక
Rashmika Mandanna Marriage Comments Naruto పెళ్ళయిపోయిందంటూ షాకిచ్చిన రష్మిక
Advertisement
Ads by CJ

రష్మిక మనసులో ఎవరున్నారో అని అంతగా ఆలోచించడం ఎందుకు రష్మిక మనసులో ఉన్నది రౌడీ హీరో విజయ్ దేవరకొండనే అనుకుంటున్నారేమో కాదండోయ్.. రష్మిక మనసులో ఉన్నది మన రౌడీ హీరో కాదు.. వేరేవారట. రష్మిక మనసులో ఉన్నవారితో ఎప్పుడో పెళ్లైపోయింది అంటూ బాంబు కూడా పేల్చింది. రష్మిక మందన్నని తాజాగా బాలీవుడ్ మీడియా వాళ్ళు మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా.. పెళ్ళెప్పుడు చేసుకుంటారు, మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడగగా.. దానికి రష్మిక అవును నా మనసులోనే కాదు.. నాకు నరుటో తో ఎప్పుడో పెళ్లయిపోయింది అంటూ షాకింగ్ న్యూస్ రివీల్ చేసింది.

తన మనసు దోచినవాడు.. ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల మనసులు దోచినవాడంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. అయితే రష్మిక మందన్న చెప్పిన ఆ నరుటో ఎవరంటే.. జాపనీస్ వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్రధారు నరుటో. అతడి పాత్రని ప్రపంచ వ్యాప్తంగా అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు. రష్మిక కూడా ఆ నరుటో కి వీరాభిమాని అట. నరుటో ని తానెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక మందన్న టైగర్ ష్రాఫ్ తో కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు ఈ విధంగా చెప్పుకొచ్చింది.

అయితే రష్మిక-విజయ్ దేవరకొండలు ప్రేమలో ఉన్నారనే ప్రచారానికి వారెంతగా అడ్డు కట్ట వేసుకుంటూ వస్తున్నా.. కొన్నిసార్లు వారే ఈ అనుమానాలకు తావిస్తూ ప్రవరిస్తూ ఉంటారు. తాము ఫ్రెండ్స్ అని చెప్పినా కొంతమంది వీరు లవర్స్ అనే అనుకుంటున్నారు.

Rashmika Mandanna Marriage Comments Naruto:

I am fully married to him - Rashmika Mandanna

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ