BRO సినిమా పట్ల మహేష్ బాబు స్పందించలేదు అనే న్యూస్ నిన్న సినీజోష్ లో పబ్లిష్ చేసినప్పటినుండి పెద్దఎత్తున స్పందన వచ్చింది. మహేష్ బాబు వెకేషన్ లో ఉన్నారు. ఆయన BRO సినిమా చూడలేదు కాబట్టి ఆయన స్పందించలేదు అనేది ఫాన్స్ వాదన. మహేష్ విషయం అలా ఉంచితే నిఖిల్ కి నితిన్ కి శర్వాకి ఏమైంది. పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులమని చెప్పుకునే వీరు వకీల్ సాబ్ అప్పుడు, భీమ్లా నాయక్ అప్పుడు ట్వీట్స్ పెట్టారు.
కానీ BRO విషయంలో ఈ యువ హీరోలంతా ఎందుకు సైలెంట్ గా కనిపించారు. అసలు వీళ్ళకేమైంది. అంతెందుకు అల్లు అర్జున్ ఎలాగూ పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన సినిమాల విషయంలో సైలెంట్ గా ఉంటాడు. అది అందరికి తెలుసు. మరి రామ్ చరణ్ కి ఏమైంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిపి యాక్ట్ చేసిన సినిమాపై ఒక్క ట్వీట్ పెట్టలేదు.
ఇవన్నీ పక్కనపెట్టేస్తే.. భోళా శంకర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నటించిన మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు-మేనల్లుడు కలిసి నటించిన సినిమాపై ఒక్క ట్వీట్ ఎందుకు వెయ్యలేదు. అసలు ఆయన ఎందుకు స్పందించలేదు. చిన్న సినిమా బేబీ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి వెళ్లి బేబీ యూనిట్ లో ఉత్సాహాన్ని నింపిన మెగాస్టార్ ఎందుకు BRO ని లైట్ తీసుకున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి తెలుసు. కాని వాళ్ళు నోరెత్తకుండా సైలెంట్ గా ఎందుకు ఉన్నారు.!