తమినాడులోని మధురైలో పెరియ రథం వీధి సమీపంలో వెళ్లింగిండ్రు వద్ద కోలీవుడ్ సహాయనటుడు మోహన్(55) అనుమాస్పదంగా మృతి చెందడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. కమల్ హాసన్ తో విచిత్ర సోదరులు చిత్రంలో సహాయ నటుడిగా నటించిన మోహన్ ఆ తర్వాత చాలా చిత్రాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో కనిపించాడు. సేలం జిల్లా మేటూర్ గ్రామానికి చెందిన మోహన్ ప్రస్తుతం సినిమా అవకాశాలు కోసం అల్లాడిపోతున్నాడు.
అయితే సేలంలో ఉండాల్సిన మోహన్ ఇలా మధురై కి ఎలా వచ్చాడు. ఇక్కడ అతను ఇంత దారుణమైన స్థితిలో మరణించడం ఎలా జరిగింది అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే సేలం నుండి మోహన్ సినిమా అవకాశాల కోసమే మధురై వచ్చినట్టుగా.. అవకాశాల కోసం తిరిగి తిరిగి అవకాశాలు రాకపోయేసరికి భిక్షాటన చేస్తూ అనారోగ్య కారణాల మూలంగానే మోహన్ మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. మోహన్ మరణించిన విషయాన్ని పోలీసులు ఆయన కుటుంబస సభ్యులకి తెలియజేసారు.