ఆగస్టు 9 మహేష్ బర్త్ డే కి కౌన్ డౌన్ మొలైపోయింది. మహేష్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం నుండి మహేష్ బాబు ఫాన్స్ కి ట్రీట్ గ్యారెంటీ. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది. ట్రీట్ ఇవ్వడానికి కావాల్సినంత స్టఫ్ ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బర్త్ డే వెకేషన్స్ కోసం పది రోజుల క్రితమే ఫ్యామిలీతో లండన్ వెళ్లిపోయారు. మహేష్ అక్కడే తన పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. మహేష్ అక్కడే ఉన్నా ఇక్కడ గుంటూరు కారం నుండి ట్రీట్ వచ్చేస్తుంది. ఆ విషయంలో ఎలాంటి సందేహము లేదు.
కానీ మహేష్ ఫాన్స్ ఎక్కువగా ఎదురు చూసేది మాత్రం త్రివిక్రమ్ మూవీ గురించి కాదు.. రాజమౌళితో మహేష్ చెయ్యబోయే SSMB29 అనౌన్సమెంట్ కోసం. రాజమౌళి ఇప్పుడు మహేష్ బర్త్ డే కి ఏమైనా ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇస్తే బావుంటుంది అనేది మహేష్ అభిమానుల కోరిక. మరి వారి కోరికని రాజమౌళి తీరుస్తారా.. లేదంటే అసలు ఇప్పుడప్పుడే షూటింగ్ మొదలయ్యేది లేదు.. అప్పుడే అప్ డేట్ ఏమిస్తామని సైలెంట్ గా ఉంటారో అంటూ మహేష్ అభిమానులే మాట్లాడుకుంటున్నారు. ఆగష్టు 9 న మహేష్-రాజమౌళి కాంబోపై ఏదైనా అప్ డేట్ వస్తే.. వారి కోరిక తీరుతుంది.. లేదంటే కాస్త డిస్పాయింట్ అవ్వడం మాత్రం పక్కానే.