పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ బంధం అందరికి తెలిసిందే. వాళ్ళిద్దరి అనుబంధం వరసగా రీమేకులని మోసుకొస్తున్నదే. ఓ వైపు ఫాన్స్ గగ్గోలు పెడుతున్నా ఇదే కోవలో తన ప్రియ మిత్రుడు త్రివిక్రమ్ సూచనలు మేరకు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఎట్టకేలకి ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కూడా పవన్ కళ్యాణ్ vs త్రివిక్రమ్ వార్ దాకా వచ్చింది. అదెలాగంటే..
ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం 2024 సంక్రాంతి టార్గెట్ ప్లాన్ చేసారు. BRO సినిమా కంప్లీట్ చేసుకుని.. BRO రిజల్ట్, కలెక్షన్స్, రికార్డులు గురించి పట్టించుకోకుండా మంగళగిరి వెళ్ళిపోయి పార్టీ కార్యకలాపాల్లో మునిగిపోయిన పవన్ కళ్యాణ్ విచిత్రంగా మైత్రి మూవీ మేకర్స్ హరీష్ శంకర్ మూవీకి డేట్స్ ఎలాట్ చేశారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో 45 డేస్ ఉస్తాద్ భగత్ సింగ్ కి కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్. అదే జరిగితే అనుకున్నది అంతా సవ్యంగా కంప్లీట్ అయితే సంక్రాంతి బరిలోకి దిగబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్. ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికే ఫిక్స్ అంటే.. త్రివిక్రమ్ గుంటూరు కారంతో పోటీ పడుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇద్దరూ పోటాపోటికి దిగుతారు.
OG సినిమా తాలుకు తన బ్యాలెన్స్ వర్క్ 22 డేస్ కంప్లీట్ చెయ్యబోతున్నారు పవన్ కళ్యాణ్. OG మేకర్స్ డిసెంబర్ రిలీజ్ అనుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అనుకుంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ తో ఇది సాధ్యమా.. పవన్ కళ్యాణ్ నుండి ఇలా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా.
ఇవన్నీ బానే ఉన్నాయి. ఆపస్మారక స్థితిలో ఉన్న హరి హర వీరమల్లుని ఎప్పుడు పట్టించుకుంటాడో పవన్!.