సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికే ఆందోళ చెందుతున్నారు. అసలు గుంటూరు కారం ఈ సంక్రాంతికి విడుదలవుతుందా? అనే ఆలోచనలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనలో ఉన్న బాబు ఫ్యాన్స్‌ని ఇప్పుడు త్రివిక్రమ్ మరింతగా టెన్షన్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ వంటి స్నేహితుడు కోసమే త్రివిక్రమ్ ఇలాంటి డైలాగ్స్‌తో BRO చిత్రం చేయించారు. ఇప్పుడు మహేష్ బాబుని ఏం చేస్తారో? అనే భయం వాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.
గుంటూరు కారం షూటింగ్ మొదలు పెట్టాక.. త్రివిక్రమ్ నుండి ప్రాబ్లమో.. మహేష్‌తో ఇబ్బందో.. తెలియదు కానీ, ఈ చిత్రం నుండి చాలామంది టెక్నీషియన్స్, ఆఖరికి త్రివిక్రమ్‌కి సెంటిమెంట్ హీరోయిన్ అయిన పూజా హెగ్డేని తప్పించడం వంటి విషయాలతో ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడలాంటి ఫ్యాన్స్‌ని త్రివిక్రమ్ ఇప్పుడు మరింతగా టెన్షన్ పెడుతున్నారు. BROలో కొన్ని డైలాగ్స్ చూస్తే ఈయనేనా.. పవన్‌తో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు తీసింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. ఆయనే ఈయనికి అట్టర్ ప్లాప్ అజ్ఞాతవాసి ఇచ్చిందంటూ కొందరు సెటైరికల్ కామెంట్స్ కూడా వేస్తున్నారు.
ముఖ్యంగా ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా గురూజీపై గుర్రుగా ఉండటం వంటిది సోషల్ మీడియాలో కనిపిస్తుంటే.. మహేష్ ఫ్యాన్స్‌లో ఆందోళన కాక ఇంకేం ఉటుంది. మరి గుంటూరు కారం షూటింగ్ సక్రమంగా జరిగి ఫైనల్‌గా సంక్రాంతికి వస్తుందా అనే అనుమానం ఇప్పుడు బలపడేలా కనిపిస్తుంది.