అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో బ్లాక్ బస్టర్ పుష్ప ద రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ మూవీ షూటింగ్ పై అభిమానుల్లో రకరకాల అనుమానాలు. ఎందుకంటే పుష్ప ద రూల్ విడుదల తేదీపై మేకర్స్ ఇంతవరకు స్పందించకపోవడం, అలాగే షూటింగ్ అప్ డేట్ పై సస్పెన్స్ క్రియేట్ చెయ్యడంతో కొంతమంది అత్యుత్సాహంతో పుష్ప ద రూల్ షూటింగ్ ఇంతవరకు అయ్యింది. అంతవరకు అయ్యింది అంటూ రకరకాల ఊహాగానాలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఓ ఛానల్ లో పుష్ప ద రూల్ షూటింగ్ 85 శాతం కంప్లీట్ అయ్యింది.
దానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా 65 శాతం కంప్లీట్ అయ్యింది అంటూ ప్రముఖంగా ప్రసారం చేసింది. ఆ న్యూస్ ని అల్లు ఫాన్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. పుష్ప2 షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది అంటూ వార్తలు చక్కర్లు కొట్టడంతో సుకుమార్ కి సన్నిహిత పీఆర్వో ఒకరు పుష్ప ద రూల్ షూటింగ్ పై వస్తున్న వార్తలని నమ్మకండి.. అవి పుకార్లే అంటూ సోషల్ మీడియా వేదికగా ఖండించడంతో.. పుష్ప ద రూల్ పై వచ్చే వార్తలన్నీ అవాస్తవాలు అని తేలిపోయింది.
మరి ఫాన్స్ లో నెలకొన్న ఈ అయోమయాన్ని పోగొట్టాలంటే పుష్ప మేకర్స్ మైత్రి మూవీస్ వారు షూటింగ్ అప్ డేట్ అయినా లేదంటే విడుదల తేదీ అయినా ప్రకటిస్తే బావుంటుంది. అసలు ప్యాన్ ఇండియా మూవీస్ షూటింగ్ మొదలు పెట్టకముందే విడుదల తేదీలు లాక్ చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్-సుకుమార్లు ఇంకా ఇలా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు.