ఇప్పటివరకు చిన్న రూమర్ కూడా రాని రాశి ఖన్నా సడన్ గా బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ రివీల్ చేసి సూపర్ షాకిచ్చింది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోయిన్ గా యంగ్ హీరోలతో సినిమాలు చేసిన రాశి ఖన్నా బబ్లీగా కనిపించేది. ఆమె బరువుగా వున్నా చూడడానికి బార్బీ డాల్ లా కనిపించేది. స్టార్ హీరో అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయిన రాశి ఖన్నా సడన్ గా నాజూగ్గా మారిపోయి బరువు తగ్గించేసి మరింత గ్లామర్ గా మారింది. ఇప్పుడు బాలీవుడ్ లో జెండా పాతేందుకు రెడీ అయ్యింది.
అయితే గతంలో రాశి ఖన్నా ఎందుకు బరువు పెరిగిందో చెప్పింది. అప్పట్లో ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను. అతనితో బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అప్పుడే బరువు పెరిగాను. దానికి తోడు థైరాయిడ్ సమస్య వలన మరింతగా బరువు పెరిగాను. అప్పుడు ఎంతగా ప్రయత్నం చేసినా, వర్కౌట్స్ చేసిన బరువు తగ్గలేదు. బరువు పెరగడంతో సినిమాలపై ఎఫెక్ట్ పడింది. హీరోయిన్స్ బరువు పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా..
అవకాశాలు కూడా రావు. ఆ సమయంలోనే నన్ను అర్ధం చేసుకునే వ్యక్తి దొరికాడు. అతనితో డేటింగ్ మొదలు పెట్టాకా అనూహ్యంగా బరువు తగ్గాను. ఎలా తగ్గానో అర్ధం కాలేదు. చాలా స్లిమ్ అయ్యాను. నేను అనుకున్నట్టుగా మారిపోయాను. ఇప్పుడు హ్యాపీ అని చెప్పిన రాశి ఖన్నా ఎవరితో డేటింగ్ లో ఉన్నానో మాత్రం చెప్పలేదు. దానితో రాశి ఖన్నా బాయ్ ఫ్రెండ్ ఎవరో అంటూ అందరూ గూగుల్ లో వెతుకుతున్నారు.