స్టార్ హీరోల అభిమానులకి నరనరాల్లో తమ హీరో మీద ప్రేమ, పిచ్చి అభిమానం జీర్ణించుకునిపోయి ఉంటుంది. హీరోల కోసం రక్తదానం చేస్తారు. అప్పుడప్పుడు హద్దులు దాటేసి చంపుకుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకునే ప్రాసెస్ లో కొట్టేసుకునే అభిమానులు కూడా ఉన్నారు. కాస్త క్లాస్ అభినులైతే సోషల్ మీడియాలో యుద్దాలు చేస్తారు. ఇక మొన్నామధ్యన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ సింహాద్రి రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ దగ్గర మేకపోతులని బలి ఇచ్చి రక్తార్పణం చేసారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు బ్లేడుతో చెయ్యి కోసుకుని హీరోపై అభిమానం చూపిస్తున్నా అంటున్నాడు. మదనపల్లి లో - BRO సినిమా ఆడుతున్న ఓ థియేటర్ దగ్గర BRO సినిమా పోస్టర్ దగ్గర పవన్ కళ్యాణ్ అంటే పడి సచ్చిపోయే అభిమాని పలుమార్లు బ్లేడుతో కోసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్ చేస్తూ ఆ అభిమాని రెచ్చిపోతున్నాడు. కాదు సైకోలా బిహేవ్ చెయ్యడం అందరికి షాకిచ్చింది.
అయితే అతను ఫుల్ గా తాగేసి ఇలా బ్లేడు తెగుతుంది అనే స్పృహ కూడా లేకుండా చెయ్యిని పదే పదే కోసుకున్నాడు. తనకి పవన్ అంటే ప్రాణం, అందుకే రక్తం ఇస్తా, ప్రాణం ఇస్తా అంటూ అక్కడ రెచ్చిపోతూ ఊగిపోయాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్ చెయ్యి కోసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.