రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఫస్ట్ థియేటర్ హిట్ అందుకున్నాడు. అతను నటించిన బేబీ చిత్రం రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో యూట్యూబర్, షార్ట్ ఫిలిమ్స్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య-విరాజ్ కలయికలో సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బేబీ చిత్రానికి చాలామంది సెలబ్రిటీస్ సపోర్ట్ గా నిలిచారు. రౌడీ హీరో విజయ్ ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాగా అల్లు అర్జున్ బేబీ అప్రిసేషన్ మీట్ కి వచ్చాడు. ఇక సక్సెస్ మీట్ కి మెగాస్టార్ గెస్ట్ గా వచ్చారు.
అయితే తాజాగా బేబీ వైష్ణవి చైతన్య తమ్ముడు తన అక్క తో కలిసి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి అక్కడ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ లతో ఫొటోలకి ఫోజులిచ్చాడు. ఇలా ఫోటోలు దిగడమనేది ఏమంత కొత్త విషయం కాదు. కానీ విజయ్ లాంటి స్టార్ హీరో పక్కన పద్దతిగా ఉండల్సిన వైష్ణవి తమ్ముడు హీరోలా బిల్డప్ ఇస్తూ దేవరకొండ బ్రదర్స్ ఇద్దరినీ వెనక్కి తోసి మరీ స్టయిల్ గా నించోవడం రౌడీ ఫాన్స్ కి ససేమిరా నచ్చలేదు. అంతేకాకుండా విజయ్ మీద చెయ్యివేసి ఫోటోలు దిగడం వాళ్లకు అస్సలు నచ్చలేదు. ఏంటి పిల్లడోవి మా హీరో మీదే చెయ్యెసేంత గొప్పోడివా.. విజయ్ దేవరకొండ అంటే చిన్న హీరో అనుకున్నావా.. నువ్వెంటి హీరోలా బిల్డప్ ఇస్తున్నావ్ అంటూ వైష్ణవి చైతన్య తమ్ముడిని సోషల్ మీడియాలో నెటిజెన్స్, రౌడీ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు.