మెగా మంత్ అంటూ జులై 28 నుండి ఆగష్టు 25 వరకు టాలీవుడ్ బాక్సాఫీసుని కబ్జా చేస్తున్నారు మెగా హీరోలు. జులై 28 న పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ BRO మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. BRO మూవీకి పబ్లిక్, అలాగే క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూస్ రాగా.. ఈ చిత్రం మొదటి మూడు రోజులు కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. కానీ మండే కలెక్షస్న్ చూస్తే BRO బయ్యర్లకి నష్టాలూ తప్పేలా లేదు. తమిళంలో హిట్ అయిన వినోదియం సిత్తం చిత్రాన్ని సముద్రఖని తెలుగులో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆధ్వర్యంలో రీమేక్ చేసారు. అయితే ఒరిజినల్ భాషలో హిట్ అయిన ఈ చిత్రం రీమేక్ గా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయింది.
పవన్ వచ్చిన పది రోజులకి మెగాస్టార్ చిరంజీవి ఆగష్టు 11 న భోళా శంకర్ తో వస్తున్నారు. చిరు కూడా తమిళంలో హిట్ అయిన అజిత్ సినిమా వేదాళం ని రీమేక్ చేసారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ పై మంచి అంచనాలున్నాయి. మెగాస్టార్ లుక్, ఆయన ఎనేర్జిటిక్ డాన్స్ అన్నీ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి. మరి పవన్ BRO రీమేక్ తేడా కొట్టింది. ఇప్పుడు భోళా శంకర్ ఏం చేస్తాడో అని మెగా ఫాన్స్ కాస్తా ఆందోళనగాను, కంగారుగాను కనబడుతున్నారు. ఎందుకంటే ఒక్కోసారి రీమేక్ వర్కౌట్ అయినా ఒక్కోసారి షాకిస్తుంది.
మెగాస్టార్ చిరు-తమన్నా జంటగా కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ కేరెక్టర్ లో కనిపించబోతుంది. ప్రస్తుతం భోళా శంకర్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే.. ప్రమోషన్స్ తో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగేలా చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.