ఈమధ్యన బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ ఒక యంగ్ హీరోకి బేబీ కథ చెప్పడానికి వెళితే కనీసం కథ కూడా వినడానికి ఇష్టపడకుండా వెళ్లిపొమ్మన్నాడంటూ చేసిన వ్యాఖ్యలకు హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో వేదికగా.. నో అంటే నో అంతే అంటూ ట్వీట్ చేసాడు. ఆ తర్వాత ఓ ఈవెంట్ లో నాకు సినిమా చేసే ఉద్దేశ్యం లేనప్పుడు వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతోనే నేను ఓ డైరెక్టర్ ని వెళ్లిపొమ్మన్నాను.. టైమ్ వాల్యూ నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా బేబీ దర్శకుడు సాయి రాజేష్ కి విశ్వక్ నో చెప్పడం వలనే జరిగింది అని అందరికి పూర్తిగా అర్ధమైంది.
ఈ విషయమై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియా వేదికగా విశ్వక్ సేన్ పేరు తియ్యకుండానే ఇండైరెక్ట్ గా సలహా కాదు కాస్త గడ్డి పెట్టారు. శోభు యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా.. ఈమధ్యన హిట్ మీదున్న ఒక యంగ్ హీరో తన యాటిట్యూడ్ వలన ఓ మంచి హిట్ సినిమాని వదులుకున్నాడు. మనం సక్సెస్ లో ఉన్నప్పుడు దానిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. ఒక డెబ్యూ డైరెక్టర్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ యుంగ్ హీరో తన యాటిట్యూడ్ తో కనీస మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోమన్నాడు.
అది అతని కెరీర్ కి ఏ మాత్రం మంచిది కాదు. ఈ విషయంలో ఆ హీరో త్వరలోనే రియలైజ్ అవుతాడని ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చేవారికి కనీస గౌరవం ఇవ్వగలిగితేనే కెరీర్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు.. ఇలాంటి యాటిట్యూడ్ వలన కెరీర్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు అంటూ శోభు యార్లగడ్డ విశ్వక్ కి ఓ సలాహా ఇచ్చారు. అయితే ఏమనుకున్నారో ఏమో శోభు ఆ ట్వీట్ ని వెంటనే డిలేట్ చేసిన అది కాస్తా అప్పటికే వైరల్ అయ్యి కూర్చుంది.