Advertisementt

మరోసారి BRO సినిమాపై అంబటి ట్వీట్

Tue 01st Aug 2023 08:58 AM
ambati rambabu  మరోసారి BRO సినిమాపై అంబటి ట్వీట్
Ambati tweet on BRO movie once again మరోసారి BRO సినిమాపై అంబటి ట్వీట్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ BRO మూవీలో YCP నేత అంబటి రాంబాబు కేరెక్టర్ ని ఇమిటేట్ చేస్తూ పృథ్వీ శ్యాంబాబు పాత్ర చేయడంపై ఆ సినిమా విడుదల రోజే అంబటి రాంబాబు స్పందించారు. అంబటి రాంబాబు BRO మూవీలో నా కేరెక్టర్ ని ఇమిటేట్ చేసారని తెలిసింది.. నా డాన్స్ లపై పవన్ కళ్యాణ్ స్పందించడం హాస్యాస్పదం.. పవన్ కళ్యాణ్ నన్ను రాజకీయంగా ఎదుర్కొలేకే.. నాపై సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ వాడుతున్నాడు.. అంటూ స్పందించగా.. 30 ఇయర్స్ పృథ్వీ మాత్రం ఆయనేమైనా ఆస్కార్ నటుడా.. ఆయన్ని ఇమిటేట్ చెయ్యడానికి, అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు. నాది బాధ్యతలేని తాగుబోతు పాత్ర, దర్శకుడు చెప్పాడు చేశాను అంటూ రియాక్ట్ అయ్యాడు. 

BRO డైలాగ్ వార్ సోషల్ మీడియాలో గత రెండురోజులుగా ట్రెండ్ అవుతుంది. అయితే అంబటి రాంబాబు మాత్రం మరోసారి BRO కలెక్షన్స్ పై సెటేరికల్ గా ట్వీట్ చేసారు. గత రాత్రి అంబటి.. ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు !.. ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు.. అంటూ ట్వీట్ట‌ర్ చేసారు. అంటే BRO ప్రొడ్యూసర్ కి ఆ సినిమాతో కలెక్షన్స్ రాకపోయినా.. పవన్ కళ్యాణ్ కి మాత్రం జేబు నిండింది అనేగా దానర్ధం అంటూ చాలామంది ఈకలు పీకుతున్నారు. మరి అంబటి ట్వీట్ పై జనసేన, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో అంటూ పవన్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

Ambati tweet on BRO movie once again:

Ambati Rambabu tweet on BRO movie once again

Tags:   AMBATI RAMBABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ