మంచు మనోజ్ అటు సినిమాల పరంగాను, ఇటు పొలిటికల్ గాను అంతగా యాక్టీవ్ గా లేడు. పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి, అన్న విష్ణుతో గొడవ విషయంలో మీడియాలో కనిపించిన మనోజ్ నేడు సోమవారం తన భార్య మౌనిక, కొడుకుతో కలిసి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుని మీటవ్వడం చర్చనీయాంశం అయ్యింది. అంటే కొన్నాళ్లుగా మంచు మోహన్ బాబు చంద్రాబబుకి టీడీపీ కి దూరంగా వైసీపీ కి జగన్ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ వచ్చారు. ఈమధ్యకాలంలో జగన్ ప్రభుత్వంతోనూ ఆంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. అయితే మంచు మనోజ్ సడన్ గా ఫ్యామిలీతో చంద్రబాబు ని మీటవుతున్నాడని తెలిసి అందరిలో రకరకాల ఊహాగానాలు మొలయ్యాయి.
మంచు మనోజ్ కూడా వదిన అఖిలప్రియ మాదిరి భార్య మౌనిక తో కలసి టీడీపీలో జాయిన్ అవుతాడేమో అనే ప్రచారం మొదలైంది. అయితే చంద్రబాబు నాయుడుతో మీటింగ్ తర్వాత మనోజ్ మాట్లాడుతూ పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చాము.. రేపు మా బాబు పుట్టినరోజు అందుజే చంద్రబాబు గారి బ్లెస్సింగ్ కోసం వచ్చాము.. అని చెప్పాడు. తర్వాత ముపూనికా మాట్లాడుతూ.. పొలిటికల్ ఎంట్రీ పై త్వరలో నిర్ణయం ఉంటుంది.. చంద్రబాబు గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది.. పెళ్లయిన తర్వాత ఎప్పటినుంచో కలవాలని అనుకున్నాం ఈరోజు కుదిరింది.. అంటూ తామెందుకు చంద్రబాబు దగ్గరకి వెళ్లారో చెప్పుకొచ్చారు.