హీరో మంచు విష్ణు జిన్నా సక్సెస్ తర్వాత మళ్ళీ సినిమాలకి భారీ గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో తలమునకలైన మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్ తో కొన్నాళ్లుగా విభేదిస్తునాడు అనేది అందరికి తెలిసిందే.. ఈమధ్యన విష్ణు-మనోజ్ లిద్దరూ కొట్లాటతో మోహన్ బాబు పరువుని బజారున పడేసారు. అదలా ఉంటే రెండేళ్ల క్రితం మంచు విష్ణు మా అధ్యక్షుడిగా పోటీ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. పొలిటికల్ ఎలక్షన్స్ మాదిరి మా ఎలక్షన్స్ విషయంలో నాగబాబుతో రాద్ధాంతం జరిగింది. మెగా ఫ్యామిలీపై, అందులోనూ మెగాస్టార్ పై మోహన్ బాబు-మంచు విష్ణు చేసిన కామెంట్స్ అప్పట్లో ఇండస్ట్రీలో వేడిని రాజేశాయి.
ఇక మా అధ్యక్షుడిగా మా భవన నిర్మాణం అనే ఎజెండాతో గెలిచిన మంచు విష్ణు ఇప్పటివరకు మా భవన నిర్మాణంపై ఫోకస్ పెట్టలేదు. అయితే ఈసారి ఎన్నికల్లోనూ మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేస్తాడనే అనుకున్నారు. కానీ మంచు విష్ణు మా ఎలక్షన్స్ లో మరోసారి పోటీ చేసే ఉద్దేశ్యం లేదని.. తాను మా ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినట్టుగా మా భావన నిర్మాణం త్వరలోనే చేపడతానని చెప్పినట్లుగా తెలుస్తుంది. మంచు విష్ణు అధ్యక్షుడిగా రెండేళ్ల పదవి కాలం పూర్తి కాబోతుంది. అయితే ఈసారి మా ఎలక్షన్స్ వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్ లలో జరిగే అవకాశం ఉంది.