కీర్తి సురేష్ కోలీవుడ్ లో మామన్నన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ స్టూడెంట్ గా కనిపించింది. ఉదయనిధి స్టాలిన్ పక్కన ఉండే పాత్రలో క్యాజువల్ లుక్స్ తో సందడి చేసింది. ఆ చిత్రం తెలుగులోనూ నాయకుడు టైటిల్ తో విడుదలైంది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుండి స్ట్రీమింగ్ చెయ్యగా.. ఓటిటీ ఆడియన్స్ నుండి విపరీతమైన ఆదరణ దక్కింది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో ట్రెడిషనల్ గా హంగామా చేసిన కీర్తి సురేష్ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆహా అంటారు.
అంత బ్యూటిఫుల్ గా పింక్ కలర్ అవుట్ ఫిట్ లో కీర్తి సురేష్ సిగ్గుపడుతూ కనిపించింది. చెవులకి పచ్చలు పొదిగిన జుంకీలతో కీర్తి సురేష్ స్మైల్ చూస్తే నిజంగా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. వయ్యారాలు పోతూ ఫొటోలకి ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ పిక్స్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. కీర్తి సురేష్ ఇకపై హైదరాబాద్ లోనే మకాం వెయ్యబోతుంది. ఓ పది రోజుల పాటు అమ్మడు ఇక్కడ భోళా శంకర్ ప్రమోషన్స్ లో పాల్గొనబోతుంది.
ఆగష్టు 11 న విడుదల కాబోతున్న భోళా శంకర్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కీర్తి సురేష్ పోస్ట్ చేసిన పిక్స్ కూడా అందులో భాగమే. మెగాస్టార్ కి సిస్టర్ కేరెక్టర్ లో కనిపించబోతున్న కీర్తి సురేష్.. ఆ చిత్రంలో కలర్ ఫుల్ గా సంప్రదాయానికి పెట్టింది పేరు లాంటి కేరెక్టర్ చేసింది.