Advertisementt

కొత్త ఫ్యామిలీ మెంబెర్ తో సమంత సందడి

Mon 31st Jul 2023 12:59 PM
samantha  కొత్త ఫ్యామిలీ మెంబెర్ తో సమంత సందడి
Samantha sets fitness goals in adorable workout video కొత్త ఫ్యామిలీ మెంబెర్ తో సమంత సందడి
Advertisement
Ads by CJ

సమంత షూటింగ్స్ అన్నిటిని పూర్తి చేసి నిన్నటివరకు బాలి లో తన ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేసి వచ్చింది. బాలిలో మార్నింగ్ వాక్, ఫ్రెండ్ తో కలిస్ డాన్స్, వర్కౌట్స్ ఇలా అక్కడ సమంత హంగామా మాములుగా లేదు. హెయిర్ కట్ తో కొత్తగా కనిపిస్తున్న సమంత సముద్రపు అంచున నిలబడి ఉన్న పిక్ ని పోస్ట్ చెయ్యగా అది నిమిషాల్లో వైరాలయ్యింది. గత వారం రోజులుగా సమంత బాలిలో రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అయితే తిరిగి హైరాబాద్ చేరుకున్న సమంత తన కొత్త ఫ్యామిలీ మెంబెర్ తో కలిసి సందడి చేస్తున్న వీడియో వదిలింది. సమంత నాగ చైతన్యతో విడిపోయాక ఒంటరిగానే ఉంటుంది. అప్పుడప్పుడు పేరెంట్స్ దగ్గరకి వెళ్లివస్తుంది. సమంతకి పెట్స్ అంటే చాలా ఇష్టం. తన గదగ్గర హ్యాష్ అనే కుక్కతో పాటుగా చైతు నుండి విడిపోయాక మరో కుక్కని తెచ్చుకుని పెంచుకుంటున్న సమంత ఇంటికి ఈమధ్యనే ఓ పిల్లి వచ్చి చేరింది. ఆ పిల్లితో కలిసి  నిద్రిస్తూ కనిపించిన సమంత తాజాగా ఆ పిల్లితో కలిసి జిమ్ లో ఆడుకుంటున్న వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది.

ప్రస్తుతం సమంత అమెరికా వెళ్లే పాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మధ్యలో ఖుషి కి సంబందించిన ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి ఆమె దాని కోసమే వెయిట్ చేస్తుంది అని లేదంటే సమంత ఎప్పుడో అమెరికా ఫ్లైట్ ఎక్కేసేదే అంటున్నారు.

Samantha sets fitness goals in adorable workout video :

Samantha sets fitness goals in adorable workout video with cat

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ