యాంకర్ శ్రీముఖి గత ఏడాదిగా అందాలు ఆరబోసే పనిలోనే నిమగ్నమైంది. అంతకుముందు తన టాక్ తోనే విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న శ్రీముఖి ఇంకొన్నాళ్ళు స్టేజ్ పై యాంకరింగ్ చెయ్యాలంటే మాట మాత్రమే కారుగా ఉంటె సరిపోదు గ్లామర్ కూడా ముఖ్యమనుకుందో ఏమో.. అందాలు చూపించేస్తూ గ్లామర్ షో కి తెర లేపింది. బుల్లితెర పై ప్రతి ఛానల్ లోను కనబడే శ్రీముఖి స్టార్ మా లో నీతోనే డాన్స్ కోసం మోడ్రెన్ గా రకరకాల కాస్ట్యూమ్స్ తో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.
ప్రతి శని, ఆదివారాల్లో నీతోనే డాన్స్ అంటూ హీరోయిన్స్ కి మించి అందాలు పరిచేస్తుంది. చిట్టి పొట్టి ఫ్రాకులతో శ్రీముఖి గ్లామర్ షో వేరే లెవల్ అన్నట్టుగా తయారైంది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో బార్బీ డాల్ లాంటి లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. వావ్ శ్రీముఖి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టేజ్ పై గొంతుతో రెచ్చిపోయే శ్రీముఖి ఇప్పుడు అదే స్టేజ్ పై అందాలు చూపించడంలో ప్రత్యేకతని చాటుతుంది.
అనసూయ తర్వాత అంతగా గ్లామర్ షో తో హైలెట్ అయ్యింది శ్రీముఖినే. అన్నట్టు ఈ శ్రీముఖి మెగాస్టార్ భోళా శంకర్ లో కనిపించబోతుంది. రీసెంట్ గా వదిలిన భోళా శంకర్ ట్రైలర్ లోని ఓ షాట్ లో శ్రీముఖి మెగాస్టార్ తో కనిపించి కనువిందు చేసింది.