సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. అందుకే ఆయన ప్రతి సినిమా తమిళ్ తో పాటుగా తెలుగులోనూ విడుదలవుతుంది. సూపర్ స్టార్ సినిమాలు వరసగా ప్లాప్ అయినా.. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ క్రేజే వేరు. తాజాగా రజినీకాంత్ జైలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. కో కో కోకిలా, వరుణ్ డాక్టర్ తో హిట్స్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించిన జైలర్ మూవీ ఆగష్టు 10న విడుదల కాబోతుంది.
ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. మరో పది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న జైలర్ మూవీకి తెలుగులో మంచి క్రేజ్ కనిపిస్తుంది. అయితే టాలీవుడ్ ని జైలర్ పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది. గతంలో సూపర్ స్టార్ హైదరాబాద్ కి వచ్చి సినిమాలని ప్రమోట్ చేస్తూ ఉండేవారు. కానీ జైలర్ విషయంలో సూపర్ స్టార్ హైదరాబాద్ కి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. కారణం ఆయన హిమాలయాస్ కి వెళ్ళినట్టుగా వార్తలు రావడమే. చెన్నై లో జైలర్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ హిమాలయాస్ కి వెళ్ళిపోతున్నారనే వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపించింది.
అంటే ఆయన హైదరాబాద్ లో జైలర్ ప్రమోషన్స్ కి రారని ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. నెల్సన్ దిలీప్ కుమార్, తమన్నా ఇలా జైలర్ టీం లోని మరికొంతమంది వచ్చి ఇక్కడ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. జైలర్ చిత్రంలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి పెద్ద స్టార్స్ గెస్ట్ రోల్స్ ప్లే చేసారు.