బాలీవుడ్ లో ప్రముఖులను ఎలా ఆడుకుందామా.. వారు ఎలా దొరుకుతారా అని వేచి చూస్తూ అవకాశం రాగానే వారిని నానా రకాలుగా ఆడుకుంటుంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఒక లేడీ బాలీవుడ్ పై ఫైట్ చేస్తుంది అనేలా కంగనా ప్రవర్తన ఉంటుంది. బాలీవుడ్ లోని బడా స్టార్స్ తోనే కయ్యానికి కాలు దువ్వుతుంది. స్టార్ కిడ్స్ పై విరుచుకుపడుతుంది. అమీర్ ఖాన్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా, రణబీర్ లాంటి హీరోలని చెప్పక్కర్లేదు. కరణ్ జోహార్ ని అయితే కంగనా అస్సలు గౌరవించదు. తాజాగా కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ నుండి ఆయన దర్శకుడిగా తెరకెక్కిన రణ్వీర్ సింగ్-అలియా భట్ ల రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రానికి దారుణమయిన ఓపెనింగ్స్ రావడంపై కరణ్ పై కంగనా చేసిన దారుణమైన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అదలా ఉంటే ఇప్పుడు మరోసారి రణబీర్ కపూర్ పై డైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. గతంలో ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన కంగనా ఈసారి రణబీర్ కపూర్ తనతో డేటింగ్ కోసం చాలా ట్రై చేశాడంటూ దారుణంగా మాట్లాడింది. రణబీర్ కపూర్ పేరు డైరెక్ట్ గా చెప్పకుండానే మాఫియా స్టార్ నాతో డేటింగ్ కోసం అర్రులు చాచుకుని కూర్చున్నారు. క్వీన్ టైమ్ లో ఆ మాఫియా స్టార్ కి ఇంకా పెళ్లి కాలేదు. అప్పటికే నా బ్యాగ్రౌండ్ మొత్తం సేకరించి నా వెనుక పడ్డాడు. నేనంటే పిచ్చ ఇష్టం. నేను షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన వచ్చేసేవాడు. డేటింగ్ చేద్దామంటూ వేధించాడు. నేను ఒప్పుకోలేదు. దానితో నా సోషల్ మీడియా హ్యాక్ చేయించి నన్ను వేధిస్తూ లొంగదీసుకోవాలనుకొలనుకున్నాడు.
అంతేకాదు నాకు సినిమా ఆఫర్స్ ఎర వేసాడు. అయినా నేను ఒప్పుకోలేదు. అప్పటినుండి అతనితో మాట్లాడలేదు. మళ్ళీ కొన్నాళ్ల క్రితం మాట్లాడానికి ట్రై చేసిన నేను మాట్లాడలేదు. కానీ అతని మాఫియా నన్ను టార్గెట్ చేసింది. నాకేమి భయం లేదు. నేను ఇలాంటివి చాలా తట్టుకున్నాను అంటూ కంగనా రణబీర్ కపూర్ ని టార్గెట్ చేస్తూ మట్లాడేసింది. అవకాశం రావాలే కానీ.. కంగనా అస్సలూరుకోదు.