Advertisementt

కూతురు సుప్రీతకి సురేఖ వాణి బిగ్ సర్ ప్రైజ్

Sun 30th Jul 2023 04:14 PM
supritha  కూతురు సుప్రీతకి సురేఖ వాణి బిగ్ సర్ ప్రైజ్
Surekha Vani is a surprise for daughter కూతురు సుప్రీతకి సురేఖ వాణి బిగ్ సర్ ప్రైజ్
Advertisement
Ads by CJ

సురేఖ వాణి తన భర్త చనిపోయాక కుమార్తె సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. కేరెక్టర్ ఆర్టిస్ట్ గా పద్దతిగల పాత్రల్లో కనిపించే సురేఖ వాణి గత కొన్నాళ్లుగా వ్యక్తి జీవితంలో చిట్టి పొట్టి డ్రెస్సులతో తన కూతురుకి పోటీ ఇస్తుంది. అటు గ్లామర్, ఇటు డాన్స్ లు అంటూ సుప్రీతతో సహా సురేఖ వాణి రెచ్చిపోతుంది. భర్త మరణానంతరం సురేఖావాణి రెండో పెళ్లి పై చాలా వార్తలు హల్ చల్ చేసాయి. ఆమె కూతురు సుప్రీత తల్లి ఒప్పుకుంటే ఆమెకి రెండో పెళ్లి చేసేందుకు సిద్ధమంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.

బర్త్ డే పార్టీలు, పబ్బులు అంటూ తెగ తిరిగేసే ఈ తల్లీ కూతుళ్లు పై ఈ మధ్యన డ్రగ్స్ కేసు విషయంలో ఏవో ఆరోపణలు కూడా వినిపించాయి. వాటిని సురేఖ వాణి ఓ వీడియో ద్వారా ఖండించింది. అయితే తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత కి బిగ్ సి ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం సురేఖ వాణి-సుప్రీతలు యుఎస్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే కూతురు సుప్రీత బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోబోతుంది. దానితో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో టైం స్క్వేర్ దగ్గర ఉన్న ఓ హోర్డింగ్ లో సుప్రీత తన తండ్రితో ఉన్న పిక్ ని డిస ప్లే చేసి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పింది. 

తన తల్లి తనకి ఇచ్చిన సర్ ప్రైజ్ బ్యూటిఫుల్ వీడియోని సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లికి థాంక్స్ చెప్పింది.

Surekha Vani is a surprise for daughter :

Surekha Vani is a big surprise for daughter Supritha

Tags:   SUPRITHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ