Advertisementt

వస్తున్నా.. వచ్చేయ్ దేవర.. వెయిటింగ్

Sun 30th Jul 2023 01:10 PM
ntr,devara  వస్తున్నా.. వచ్చేయ్ దేవర.. వెయిటింగ్
Devara special update వస్తున్నా.. వచ్చేయ్ దేవర.. వెయిటింగ్
Advertisement
Ads by CJ

వస్తున్నా అంటున్న దేవరా.. వచ్చేయ్ అంటున్న కార్తికేయ.. వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా!. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ లాంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత కొరటాల శివతో తన తదుపరి ప్రాజెక్ట్ దేవరని కాస్త కాదు చాలా ఆలస్యంగానే పట్టాలెక్కించారు. కానీ దేవర ఒక్కసారి సెట్స్ మీదకెళ్లాక అడుగడుగునా అప్ డేట్స్ తో మేకర్స్ అభిమానులకి ట్రీట్ ఇస్తూ వస్తున్నారు. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోపై అంచనాలు ఏ లెవల్లో ఉన్నాయో ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్న వారిని అడిగితే చెబుతారు. ఇప్పటివరకు యాక్షన్ సీన్స్ గురించి పదే పదే మాట్లాడుకుంటున్న వారు ఇప్పుడు రిలీజ్ తేదీ గురించి మాట్లాడుకుంటున్నారు.

ఏప్రిల్5 2024 న దేవర బిగ్ స్క్రీన్స్ లో విడుదల అంటూ 2023 న్యూ ఇయర్ రోజునే మేకర్స్ ప్రకటించారు. అయితే దేవరా ఏప్రిల్ 5 న థియేటర్స్ లో దిగడానికి ఇంకా 250 డేస్ మాత్రమే ఉంది అంటూ దేవర మేకర్స్ సోషల్ మీడియాలో క్రేజీగా ఫ్యాన్స్ ని ఊరిస్తూ పోస్ట్ పెట్టారు. 250 days to witness fear unleash on the big screen 💥🌊 Vastunna.. #Devara from 5th April 2024.. అని పెట్టిన పోస్ట్ కి రాజమౌళి కొడుకు ఎన్టీఆర్ ఫ్రెండ్ కార్తికేయ వచ్చేయ్ వెయిటింగ్ అంటూ రీ ట్వీట్ చేసాడు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా అప్పుడు లైన్ ప్రొడ్యూసర్ గా తమని బాగా కష్టపెట్టిన కార్తికేయ గురించి ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అన్నా అంటూ చావగొట్టేవాడు అంటూ. ఇక తాజాగా దేవర కోసం వెయిటింగ్ అంటూ కార్తికేయ చేసిన ట్వీట్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రీ ట్వీట్స్ చేస్తూ షేర్స్ కొడుతూ హంగామా మొదలు పెట్టారు. 

Devara special update:

NTR Devara special update

Tags:   NTR, DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ