పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ లో తమ కో స్టార్స్ అంతా తనకి స్నేహితులే.. తమ మధ్యన ఆరోగ్యపరమైన వాతావరణం ఉంటుంది.. ఎలాంటి ఈగో ఉండదు, మా మధ్యన మంచి అనుబంధం ఉంది.. ప్రభాస్ ఫాన్స్ తో మా అభిమానులు గొడవపడ్డారని తెలిసింది.. ప్రభాస్ అభిమానులకి మనస్ఫూర్తిగా క్షమాపణలు, జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ అంటే ఇష్టం, చరణ్, అల్లు అర్జున్ , చిరంజీవి గారు, మహేష్, ప్రభాస్ ఇలా అందరి సినిమాలు చూస్తాను అంటూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దగ్గనుంచి.. నిన్నగాక మొన్న జరిగిన BRO ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు చెబుతూ వచ్చారు.
సినిమాల్లో ఎలా ఉన్నా ఓట్స్ మాత్రం తనకే వెయ్యమంటూ అడగగానే అడిగేసారు పవన్ కళ్యాణ్. అప్పట్లో పవన్ కళ్యాణ్ జనసేన మీటింగ్స్ లో ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో హడావిడి చెయ్యడం కనిపించింది. కానీ BRO సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా రిజల్ట్ అలాగే మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ ఫాన్స్ పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం.. ఎన్టీఆర్ గత మూవీ కలెక్షన్స్ కన్నా బ్రో మూవీ కలెక్షన్స్ తక్కువ అంటూ ఎద్దేవా చెయ్యడం మాత్రమే కాదు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ vs పవన్ ఫాన్స్ అన్న రేంజ్ లో కొట్లాట మొదలైంది.
ఖుషి-సింహాద్రి రీ రిలీజ్ తర్వాత కలెక్షన్స్ విషయంలో పవన్ ఫాన్స్ పనిగట్టుకుని ఎన్టీఆర్ ఫాన్స్ ని కించపరచడంతోనే ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ పవన్ ఫాన్స్ తో వార్ కి దిగారు. మరి పవన్ కళ్యాణ్ మేమంతా స్నేహితులమే అంటూ రాజకీయాల్లో చెప్పినా.. అభిమానులు మాత్రం సినిమాల విషయంలో మాత్రం తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అనే కాడే ఉన్నారు తప్ప వారిలో మార్పేమి కానరావడం లేదు.