నటుడిగా అందరూ ఇష్టపడే సముద్రఖని కోలీవుడ్ లో డైరెక్టర్ గా సత్తా చాటారు. అయితే నటుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సముద్రఖని దర్శకత్వం మాత్రం తెలుగు వాళ్ళకి కొత్తే. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే తమిళంలో కోవిడ్ కి ముందు వినోదియం సిత్తం అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. అదే కథతో తెలుగులో పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ల కలయికలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే పవన్ తో ఈ సినిమా చెయ్యడానికి త్రివిక్రమే కారణం. ఆయన దగ్గరకి వెళ్లి సముద్రఖని కథ చెప్పడంతోనే ఆయన పవన్ కి చెప్పి ఒప్పించారు.
అయితే తమిళంలో హిట్ అయిన వినోదియం సిత్తాన్ని తెలుగులోకి వచ్చేసరికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ మొత్తం మార్చేసినట్లుగా సముద్రఖని BRO చిత్రం విడుదల ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగినట్లుగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ మార్పులు చేసినట్లుగా సముద్రఖని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే BRO విడుదలై మిక్స్డ్ టాక్ రావడంతో ఇప్పుడు అందరూ ఈ చిత్ర రిజల్ట్ విషయంలో తివిక్రమ్ నే బ్లేమ్ చేస్తున్నారు.
ఎక్కడా సముద్రఖని దర్శకత్వాన్ని వేలెత్తి చూపించడం లేదు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే పై కామెంట్స్ చేస్తున్నారు కానీ.. సముద్రఖని పై ఎక్కడా నెగెటివ్ కామెంట్స్ రావడం లేదు. ఆయనేదో రీమేక్ చేసుకుందామనుకుంటే.. త్రివిక్రమ్ మొత్తం చెడగొట్టారని ఇప్పుడు అందరూ ఫిక్స్ అవడం చూస్తే.. BRO రిజల్ట్ విషయంలో సముద్రఖని మాత్రం సేఫ్ అయ్యారని క్లియర్ గా అర్ధమవుతుంది.