యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కోరటాల శివ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరిగిపోతుంది. దేవర సెట్స్ మీదకి వెళ్ళేసరికే హైదరాబాద్ లోని శంషాబాద్ ఏరియాలో ఈ చిత్రానికి కావల్సిన సెట్స్ ని రెడీ చేసుకుని.. ఓ షెడ్యూల్ పూర్తి కాగానే మరో షెడ్యూల్ మొదలు పెట్టేలా కొరటాల పకడ్బందీ ప్లాన్ చేసుకున్నాడు. అందుకే దేవర షూటింగ్ కి ఎక్కాడా అంతరాయం కలగడం లేదు. అయితే ఇప్పుడు దేవర ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారు.
ఈ క్రేజీ సెట్ లో రెండు వారాల పాటు దేవర యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ఈ సీక్వెన్స్ ఇంటర్వెల్ కి ముందు వస్తుందట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతుంది అంటున్నారు. కొరటాల శివ ఎన్టీఆర్ డేట్స్ తో పాటుగా మిగతా కీలక నటుల డేట్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుంటూ.. లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు. దానితో ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది అని అక్టోబర్, నవంబర్ కల్లా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అని సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా దేవర షూటింగ్ లో తలమునకలై ఉన్నాడట. కొత్త కొత్త మేకోవర్ తో ఎన్టీఆర్ ఫాన్స్ కి ట్రీట్ గ్యారెంటీ అంటున్నారు. జాన్వీ కపూర్ తో రొమాంటిక్ సీన్స్ కూడా అదిరికిపోతాయంటూ వినిపిస్తున్న వార్తలతో ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా కనబడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్-ఎన్టీఆర్ మధ్యన భీకర సన్నివేశాలు ఉంటాయని.. అవే ఈ చిత్రానికి హైలెట్ అని అంటున్నారు.