మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సక్సెస్ తర్వాత భోళా శంకర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆగష్టు 11న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భోళా శంకర్ పై ప్రస్తుతం మార్కెట్ లో మంచి అంచనాలున్నాయి. గాడ్ ఫాదర్-వాల్తేర్ వీరయ్య సక్సెస్ అవడంతో భోళాపై ప్రేక్షకులు, ట్రేడ్ లో హైప్ బాగా క్రియేట్ అయ్యింది. అయితే తాజాగా భోళా శంకర్ కి మెగాస్టార్ పారితోషకంపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
అది భోళా శంకర్ కి మెగాస్టార్ చిరు సింగిల్ పై పారితోషకం తీసుకోవడం లేదట. అంటే చిరంజీవి ఫ్రీగా మూవీ చేసేసారు అనుకుంటున్నారేమో. కాదు భోళా శంకర్ కి మెగాస్టార్ లెక్క వేరేగా ఉందట. ఇప్పటికే భోళా శంకర్ కి భారీ బిజినెస్ జరిగిపోయింది. థియేట్రికల్ బిజినెస్, ఓవర్సీస్ బిజినెస్, ఓటిటీ రైట్స్, శాటిలైట్ హక్కులు ఇలా భారీగా అమ్ముడుపోయిందట. మేకర్స్ కూడా టేబుల్ ప్రాఫిట్ తోనే భోళా శంకర్ ని వదులుతున్నారు. అయితే భోళా శంకర్ రిలీజ్ అయ్యి లాభాల బాట పట్టగానే మెగాస్టార్ అందులో నుండి కావల్సిన పారితోషకం తీసుకుంటారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.
అంటే మెగాస్టార్ చిరు భోళా శంకర్ పారితోషకం విషయంలో వేరే లెక్కలో ఉన్నారన్నమాట. తన పారితోషకాన్ని ఏ లెక్కలో తీసుకోబోతున్నారో అనేది భోళా శంకర్ రిజల్ట్, కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయన్నమాట. తమన్నా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ కేరెక్టర్ లో కనిపిస్తుంది.