BRO చిత్రంలో పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశించి ఓ డైలాగ్ వేశారు, 30 ఇయర్స్ పృథ్వి ని పెట్టి శ్యామ్ బాబు గా అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సమయంలో చేసిన ఓ డాన్స్ ని ఇమిటేట్ చేయించారు.. దానితో పవన్ కళ్యాణ్ శ్యాంబాబు..! వస్తున్న టెంపో ఏంటి.. నువ్వు వేస్తున్న స్టెప్పులేంటి..? తకిట తకిటత 6-8 తకథిమి తకథిమిత 2-4 అంటూ చెప్పిన డైలాగ్ అంబటి ని ఉద్దేశించే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరి పవన్ పై ఒంటికాలుతో లేచే అంబటి రాంబాబు తనపై డైలాగ్స్ పేలిస్తే ఉంకుంటాడా.. వెంటనే ట్విట్టర్ వేదికగా.. గెలిచోనోడి డ్యాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి అని ట్వీట్ చేసాడు. అంతేకాకుండా BRO లో నా కేరెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను, నేను ఎవరి దగ్గరో ప్యాకేజి తీసుకుని డాన్స్ చెయ్యను, పవన్ కళ్యాణ్ నా డాన్స్ గురించి మాట్లాడుతున్నాడు అంటే అతను ఎంతగా దిగజారిపోయాడో అర్ధమవుతుంది. పవన్ ది శునకానందం, పవన్ రాజకీయాలకి సరిపోడు. రాజకీయంగా ఎదుర్కొలేకే నాపై ఇలాంటి విమర్శలు చేస్తున్నాడు.. అంటూ అంబటి పవన్ బ్రో డైలాగ్ పై కౌంటర్ వేసాడు.
ఇక నటుడు పృథ్వి కూడా ఈ వివాదంపై స్పందించాడు. BRO లో దర్శకుడు నాకిచ్చిన కేరెక్టర్ నేను చేశాను. బాధ్యత లేని ఓ వ్యక్తి పాత్ర నాది, నేను అంబటి పాత్ర చెయ్యలేదు, ఆయనేమి ఆస్కార్ నటుడు గొప్ప న్తుడేమి కాదు, ఆయన్ని కాపీ చెయ్యడానికి అంటూ BRO డైలాగ్ వార్ పై స్పందించాడు.