తమన్నాకి హీరోయిన్ గా ఫెడవుట్ అయ్యిపోతానని ఏదైనా భయం మొదలయ్యిందా.. లేదంటే కెరీర్ లో ఎన్నడూ లేని గ్లామర్ షో తమన్నా చెయ్యదు. సినిమాల్లో కన్నా వెబ్ కంటెంట్ లో అయితే మరీ రెచ్చిపోతుంది. ఇప్పుడు భోళా శంకర్-జైలర్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్నాయి. ఆ సినిమా ప్రమోషన్స్ లో తమన్నా గ్లామర్ కూడా హైలెట్ అయ్యేలా చూసుకుంటుంది. జైలర్ లో నువ్ కావాలయ్యా సాంగ్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. హిందీలో జైలర్ ప్రమోషన్స్ మొత్తం తన భుజాన మోస్తుంది.
అంతేకాదు సందర్భం వచ్చినా రాకపోయినా అందాలు ఆరబోసే అవుట్ ఫిట్స్ తో హంగామా మొదలు పెట్టింది. జైలర్ కి తమన్నా గ్లామర్ హైలెట్ అనేలా ప్రవర్తిస్తుంది. మరి సీనియర్స్ లిస్ట్ లోకి చేరాను.. ఇకపై అవకాశాలు రావేమో... ఇలా గ్లామర్ షో చేస్తే మరికొన్నాళ్లు బిజీ లైఫ్ ని లీడ్ చెయ్యొచ్చు, స్టార్స్ హీరోల అవకాశాలు వస్తాయి.. అనుకుంటుందేమో.. అందుకే ఇంతిలా రెచ్చిపోతుంది తమన్నా అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. వారు అనడం కాదు గాని.. తమన్నాని చూస్తే అదే అనిపిస్తుంది.
గ్లామర్ విషయంలో హద్దులు దాటేసి ప్రవర్తిస్తుంది. గ్లామర్ షో విషయంలో నెక్స్ట్ లెవల్ చూపిస్తుంది. మరి భోళా శంకర్-జైలర్ ఇందులో ఏది వర్కౌట్ అయినా ముందుగా కలిసొచ్చేది తమన్నాకే. ఆ విజయంతో మరిన్ని అవకాశాలు ఆమె చెంతకు చేరతాయి.